కాజల్ కల్యాణం

ముద్దు గుమ్మ కాజల్ అగర్వాల్.. గౌతమ్ కిచ్లు ను పెళ్లాడింది. అక్టోబర్ 30న గౌతమ్ తో కలిసి ఏడడుగులు వేసిన కాజల్.. మూడు ముళ్ల బంధంతో ఒకటై పోయింది. రెడ్ అండ్ గోల్డ్ కలర్ లెహంగా, అందుకు తగిన జ్యూవెలరీతో పెళ్లి బట్టల్లో పంచదార బొమ్మ మెరిసిపోతుండగా.. గౌతమ్ లైట్ పింక్ శర్వాణిలో అందాల చందమామతో నవ్వులు చిందిస్తూ కనిపించాడు. ఈ పిక్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.