Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మందుల సామెల్ కు భారీ మెజార్టీ…. ఖాయం..!

ప్రభుత్వం, కిషోర్ పై ఉన్న వ్యతిరేకతే… సామెల్ గెలుపుకు నాంది.

నియోజకవర్గంలో మద్యం డబ్బు ప్రభావం.. చూప లేదంటున్న విశ్లేషకులు

సూర్యాపేట ప్రతినిధి డిసెంబర్ 2 (నిజం చెపుతాం న్యూస్)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో నిరుపేదలకు గ్రామాల్లో అందకపోవడంతో నియోజకవర్గంలోని ప్రజల్లో వ్యతిరేకత

,మరొక పక్క ఎమ్మెల్యే గాదరి కిషోర్ ఒంటెద్దు పోకడతో, గ్రామాల్లోని బిఆర్ఎస్ నాయకుల అవినీతి ,దౌర్జన్యాలతో విసిగి చెందిన ప్రజలు.. ఉద్యమ నాయకుడు  మందుల సామెల్ కు కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ బృందం టికెట్టును కట్టబెట్టడం… మొదటగా గెలుపుకు నాంది పలికింది.

గత ఎన్నికలతో పోలిస్తే.. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థి కోట్ల రూపాయలతో భారీ సభలు ఏర్పాటు చేసి, డబ్బులు మద్యం ఏరులై పారాయి.

నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని పలు పర్యాయాలు చుట్టూ ముట్టినప్పటికీ, బిఆర్ఎస్ నాయకుల వ్యతిరేకత… హద్దులు దాటాయి

దీనితో ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ ప్రియాంక సోనియా గాంధీ పర్యటనలు సమావేశాలు తెలంగాణ ప్రజలకు ఊపునిచ్చాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు గృహలక్ష్మి బీసీ బందు పథకాలు గ్రామాల్లో బిఆర్ఎస్ నాయకులకు కేవలం జేబులు నింపాయని ప్రజలు గమనించారు.

ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామెల్ తనదైన శైలిలో తక్కువ టైం లో ఎక్కువగా నాయకులను ప్రజలను కలుస్తూ దండం పెడుతూ, ముందుకు సాగారు.

నియోజకవర్గంలోని ప్రజలకు కోట్ల రూపాయల మద్యం డబ్బులు పంపిణీ చేసినప్పటికీ… నియోజకవర్గ ప్రజలు ఈ డబ్బంతా మాదే అని గ్రహించి, తీసుకున్నాం.. ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి వేయాలని గ్రామాల్లో నిర్ణయించుకోవడం గమనార్వం.

దీనితో నవంబర్ 30న జరిగిన ఎన్నికల్లో గ్రామాల్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామెల్ కు చెయ్యి గుర్తుపై ఓటు వేసినట్లు… నియోజకవర్గంలోని గ్రామాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలే చర్చించుకున్నారు…

కొన్ని కేంద్రాల్లో అధికార పార్టీ బూతు నాయకులు వదిలి వెళ్ళిపోయారు… నియోజకవర్గంలోని గ్రామాల్లోని ప్రజలకు పూర్తిస్థాయిలో డబ్బులు పంపిణీ చేయలేదని, కొంతమంది అధికార పార్టీ నాయకులను నిలదీశారు

. ఏది ఏమైనా డిసెంబర్ 3 కౌంటింగ్ లో భారీ మెజార్టీతో సామెల్ గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు, విశ్లేషకులు భావిస్తున్నారు,

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామెల్ మాత్రం తనకు టికెట్ వచ్చిన రోజే , భారీ మెజార్టీతో తన గెలుపు ఖాయమైందని ఫోన్లో నిజం న్యూస్ తో ….ముచ్చటించారు.