Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక్క బిఆర్ఎస్ ఎమ్మెల్యేను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వను

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చౌటుప్పల్, నవంబర్14,(నిజంచెపుతాం): సిపిఐ,టీజేఎస్, షర్మిల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపుకై చౌటుప్పల్ మండలం ధర్మోజి గూడెం గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం ప్రజా దీవెన సభ నిర్వహించారు.

ఈ బహిరంగ సభలో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ

60 ఏళ్లు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవం లేదని,

ఇప్పుడు జరిగే ఎన్నికలు ఆత్మ గౌరవ నికి ప్రతికని

కెసిఆర్ పై ఉద్యమం చేయడానికి బీజేపీ వాళ్ళ మాటల నమ్మి నా పదవి త్యాగం చేసి పోరాటం చేశానని,ఉప ఎన్నిక తర్వాత బిజెపి బి ఆర్ఎస్ ఒక్కటేనని అర్థమైందన్నారు.

పది సంవత్సరాలుగా అవినీతి పరిపాలన చేస్తున్న కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణకు దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశాడని,

డబల్ బెడ్ రూమ్ ఇస్తానని,ఇంటికొక ఉద్యోగం ఇస్తానని, మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశాడన్నారు. తెలంగాణ ఇచ్చిన

కాంగ్రెస్ పార్టీ సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలని

సోనియాగాంధీ రుణం తీర్చుకోవాలంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించలన్నారు. మునుగోడు

నియోజకవర్గం అభివృద్ధి చేయాలంటే నిధులు ఇవ్వడం సమస్యల పరిష్కారం కోసం కలుద్దామంటే అపాయింట్మెంట్ ఇవ్వడని,

అటువంటి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి అవసరమా అన్నారు.

కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటెయ్యండి ప్రతి మహిళకు నెల 2500 ఇస్తుందని,కాంగ్రెస్ పార్టీ ఇంటి స్థలం ఉన్న పేదలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తుందని,

అసర పింఛన్ 2000 నుండి 4వేలకు పెంపు,ప్రతి పేదవానికి 200 యూనిట్ల వరకు కరెంటుఫ్రీ,మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం,

కాంగ్రెస్ పార్టీ రైతులకు రెండు లక్షల రూపాయల ఏకకాలంలో రుణమాఫీచేస్తుందని,

సంవత్సరానికి రైతుబంధు ఎకరానికి 15000/-

కౌలు రైతులకు కూడా రైతుబంధు అందించే ప్రక్రియ ప్రారంభిస్తుందన్నారు.

లక్షల కోట్లు దోచుకుంటున్న కేసీఆర్ గురించి చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం ఒక తాటి మీదికి రావాల్సిన అవసరం ఉందని,

ఒకసారి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి.

కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీఅని అన్నారు.

నేను రాజీనామా చేసిన తర్వాత ప్రభుత్వం దిగివచ్చి అభివృద్ధి చేసింది అది కేవలం కొంత అభివృద్ధి మాత్రమేనని

మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సిద్దిపేట సిరిసిల్లకు దీటుగా అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు.

ఈ సభలో సిపిఐ మాజీ ఎమ్మెల్యేలు పల్లా వెంకట్ రెడ్డి, ఉజ్జయిని యాదగిరి రావు, నెల్లికంటి సత్యం, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆడెం సంజీవరెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శి ఉన్న కైలాస్ నేత, చౌటుప్పల్ మండల అధ్యక్షులు బోయ దేవేందర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి,

జడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి,ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, చౌటుప్పల్ మున్సిపల్ అధ్యక్షులు సుర్వి నర్సింహా గౌడ్,

మున్సిపల్ చైర్మన్లు, వివిధ గ్రామాల సర్పంచులు,గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యదర్శులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు హాజరైన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.