ఈ నాయకులను నమ్మేదెట్ల?
పూటకో పార్టీ కండువా కప్పుకుంటున్న మండల నాయకులు
నాయకుల తీరు చూసి నవ్వుకుంటున్న ప్రజలు
చివరి వరకు ఏ పార్టీ వెంట ఎవరుంటారు?
చర్ల నవంబర్ 11 (నిజం చెపుతాం)
అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది వివిధ పార్టీల నేతలు పూర్తిగా చేరికలపైనే ప్రధానంగా దృష్టి సారించారు.ప్రత్యక్ష
ప్రచారానికి భిన్నంగా వివిధ పార్టీల నుంచి విరివిగా
వలసలను ప్రోత్సహిస్తున్నారు.
దీంతో ఒక పార్టీ నుంచి
మరో పార్టీలో చేరే వారి సంఖ్య రోజురోజుకూ
పెరుగుతోంది.ఇదిలా ఉంటే చర్ల మండలంలో నాయకుల తీరు ఎలా ఉందంటే నవ్వనవ్విపోదురుగాక నాకేంటి అనే చందంగా తయారైంది
మండలంలోని ప్రధాన పార్టీలైనా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూటకో పార్టీమరుతూ రోజుకో కండువా కప్పుకుంటూ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తూ,తామ వ్యక్తిత్వలాను కూడా నవ్వులపాలు చేసుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్,కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు ఇటు నుంచి అటు నుంచి ఇటు
పరుగులు పెడుతూ రోజులు గడిస్తున్నారు.ఈ నాయకులను చూస్తున్న ప్రజలు సైతం నవ్వుకుంటున్నారు.ఇవ్వాల ఓ కండువాతో ప్రచారానికి వచ్చే నాయకులు రేపు ఏ కండువతో వస్తాడో తెలియని పరిస్థితి నెలకొంది…నిన్న ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించిన నాయకులే
రేపు అదే పార్టీ కండువాకప్పుకుని ప్రత్యక్షమవుతున్నారు..
ఈ పూటకో పార్టీలు మారుతున్న నాయకుల వెంట కార్యకర్తలు లేకపోయినప్పటికీ ఇలాంటి సన్నివేశాలు చూసే ప్రజలు పెదవి విరుస్తున్నారు.
చివరివరకు నిలిచే,నిలిపేదెవరు
భద్రాచలం నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైనా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్యే తీవ్ర పోటి ఉన్నప్పటికీ ఆయా పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలను చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
ఇలా తాత్కాలిక నిర్ణయాలతో అటు నుంచి ఇటు నుంచి అటు మారే వ్యక్తులను తామేట్ల నమ్మెదని ప్రజలకు అభిప్రాయ పడుతున్నారు.
చివరి వరకు ఎవరి వెంట ఎవరుంటారనేది తెలుసుకోవాలంటే మరో పక్షం రోజులు వేచి చూడాల్సిందే….