కాంగ్రెస్ కు ఓటేస్తే పదవులు …… బీఆర్ఎస్ కు వేస్తే సంక్షేమ పథకాలు
రాబోయే ఎన్నికలు ప్రజల భవిష్యత్తును మార్చే ఎన్నికలు..
భీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యం
60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమీ లేదు
ఎవరికి వేసిన ఓటు ఏం తెచ్చిందో ప్రజల ఆలోచించాలి
కులాలు మతాల పేరు మీద దొంగలంతా ఏకమవుతున్నారు
నాకంటూ శత్రువులు ఎవరూ లేరు
ప్రజల శత్రువులే నా శత్రువులు
నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత నాదే
రైతుబంధు రైతు బీమా 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవు
పట్టణాలకు దీటుగా గ్రామాల అభివృద్ధి
ఒక్కో గ్రామానికి అభివృద్ధి- సంక్షేమకోసం కోట్లాది రూపాయల నిధులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భీఆర్ఎస్
గత పాలకుల హయంలో అన్ని ఉండి ఆగం అయిపోయినాం
కాంగ్రెస్కు ఓటేస్తే కరెంటు కష్టాలే
కర్ణాటక పరిస్థితులే ఇక్కడా పునరావృతం అవుతాయి
కాంగ్రెస్ బిజెపి పాలిత కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్లో ఇచ్చే కరెంట్ 3 నుండి 6 గంటలే
మూసి సాగర్ ఆయకట్టు కింద వరుసగా 18 పంటలకు సాగు నీరు ఇచ్చిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీ ది
పదవులకోసం ఆంధ్ర పాలకులకు అడుగులకు మడుగులఒత్తి రైతులకు అన్యాయం చేసిన పాపం కాంగ్రెస్ నాయకులది
నల్లగొండ కాంగ్రెస్ నాయకుల చేతగాని తనం వల్లే వరుసగా ఏడు ఏళ్లు ఎడమకాలువ ఎండిపోయింది
ఆంధ్రాలో ఎకరం అమ్ముకొని తెలంగాణలో 10 ఎకరాలు కొనే రోజులు పోయి, తెలంగాణలో ఎకరం అమ్ముకొని ఆంధ్రలో 100 ఎకరాలు కొనే రోజులు వచ్చాయి
కళ్ళముందే మూసి నీరు లీకు అవుతున్నా పట్టించుకోని పాపం గత పాలకులదే
చెప్పిన మాట పైన నిలబడే నాయకుడు కేసీఆర్
ప్రచార హోరు..బీఆర్‌ఎస్ జోరు
మంత్రి ప్రచారం .. సూర్యాపేట లో దూసుకెళ్తున్న కారు..
భారీ మెజార్టీ లక్ష్యంగా బీఆర్‌ఎస్ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రచారం
గులాబీ పార్టీనే మళ్లీ గెలిపించుకుంటామంటున్న ప్రజలు
గ్రామ గ్రామాన మంగళ హరతులతో అపూర్వ స్వాగతం
మంత్రికి మద్దతుగా ఏకమై కదులుతున్న పల్లెలు
మంత్రి హ్యాట్రిక్ విజయాన్ని కాంక్షిస్తూ అనంతారంలో సర్వమత ప్రార్థనలు
బైక్ ర్యాలీ లతో స్వాగతం చెబుతూ బ్రహ్మరథం పట్టిన యువతరం
కాంగ్రెస్ ,బిజెపి ను వీడి బీఆర్ఎస్ లో చేరిన వందలాధి కుటుంబాలు
పెన్ పహాడ్ మండలం అనంతారం, అన్నారం, అన్నారం బ్రిడ్జి, నారాయణ గూడెం, నాగులపహాడ్ లో కొనసాగిన మంత్రి ప్రచారం
కాంగ్రెస్ కు ఓటేస్తే ఆ నాయకులకు వచ్చేది పదవులు మాత్రమే అయితే… భీఆర్ఎస్ కు వేసే ఓటు తో ప్రజలకు సంక్షేమ పథకాలు వస్తాయి అని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్ధి , రాష్ట్ర మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట నియోజకవర్గం లోని పెన్ పహాడ్ మండలం అనంతారం, అన్నారం , అన్నారం బ్రిడ్జి, నారాయణగూడెం, నాగుల పహాడ్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు.
ప్రచారం సందర్బంగా గ్రామాలలోకి వెళ్ళిన అభివృద్ధి ప్రదాత కు యువకులు బైక్ ర్యాలీ లతో స్వాగతం పలుకగా, మహిళలు మంగళ హరతులతో ఆత్మీయ ఆహ్వానం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలు ప్రజల భవిష్యత్తును మార్చే ఎన్నికలు అన్నారు. రాష్ట్రాన్ని దశాబ్దాలు గా పాలించిన కాంగ్రెస్ పాలనలో ఒరిగిందేమీ లేదన్నారు.
ఎవరికి వేసిన ఓటు ఏం తెచ్చిందో ప్రజల ఆలోచించాలి అన్నారు.
కులాలు మతాల పేరు మీద దొంగలంతా ఏకమవుతున్నారని అన్న మంత్రి,నాకంటూ శత్రువులు ఎవరూ లేరుప్రజల ఆస్తులు, భూములను దోచుకుంటున్న వారి శత్రువులే నా శత్రువులు అన్నారు.
నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత నాదే అన్నారు.రైతుబంధు రైతు బీమా 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవన్నారు.పట్టణాలకు దీటుగా గ్రామాల అభివృద్ధి లో దూసుకుపోతున్నాయని అన్నారు.
గత పాలన లో లక్ష రూపాయిలు కూడా అభివృద్ధి , సంక్షేమం కోసం వచ్చేవి కావన్న మంత్రి,ఒక్కో గ్రామానికి అభివృద్ధి- సంక్షేమకోసం కోట్లాది రూపాయల నిధులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భీఆర్ఎస్ అన్నారు.
గత పాలకుల హయంలో అన్ని ఉండి ఆగం అయిపోయినాం అన్నారు.
కాంగ్రెస్కు ఓటేస్తే కరెంటు కష్టాలు రావడం ఖాయం అన్న మంత్రి,
కర్ణాటక పరిస్థితులే ఇక్కడా పునరావృతం అవుతాయి అన్నారు.
కాంగ్రెస్ బిజెపి పాలిత కర్ణాటక మహారాష్ట్ర గుజరాత్లో ఇచ్చే కరెంట్ 3 నుండి 6 గంటలే అన్నారు.
మూసి సాగర్ ఆయకట్టు కింద వరుసగా 18 పంటలకు సాగు నీరు ఇచ్చిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీ ది అన్నారు. గతం లో ఏడు ఏళ్లు ఇక్కడి రైతులకు అన్యాయం చేసి మన నీటిని ఆంధ్ర కు తీసుకుపోతుంటే, పదవులకోసం ఆంధ్ర పాలకులకు అడుగులకు మడుగులఒత్తి రైతులకు అన్యాయం చేసిన పాపం నల్లగొండ కాంగ్రెస్ నాయకులది అన్నారు.
నల్లగొండ కాంగ్రెస్ నాయకుల చేతగాని తనం వల్లే వరుసగా ఏడు ఏళ్లు ఎడమకాలువ ఎండిపోయింది అన్నారు. వరుసగా 18 పంటలకు సాగు నీరు రావడం తో
ఆంధ్రాలో ఎకరం అమ్ముకొని తెలంగాణలో 10 ఎకరాలు కొనే రోజులు పోయి, తెలంగాణలో ఎకరం అమ్ముకొని ఆంధ్రలో 100 ఎకరాలు కొనే రోజులు వచ్చాయని అన్నారు.. ఆ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబే ఈ వ్యాఖ్యలుచేశారని గుర్తు చేశారు.
కళ్ళముందే మూసి నీరు లీకు అవుతున్నా పట్టించుకోని పాపం గత పాలకులదే అన్నారు. మూసీ ప్రాజెక్టు శిధిలావస్థకు చేరుకుని నీరు వృదా గా పోతున్న పట్టించుకునే పాపాన పోలేదన్నారు..2014 లో తాను గెలిచాకనే మూసీ గేట్లను ఆధునికరించి వరుసగా 18 పంటలకు నీరు ఇచ్చి, 30 వేల ఎకరాలను ససశ్యామలం చేశామని తెలిపారు.
చెప్పిన మాట పైన నిలబడే నాయకుడు కేసీఆర్ అన్న మంత్రి, గత రెండు మ్యానిఫెస్టోలను అక్షరక్షరం అమలు చేశారని అన్నారు. మరోసారి గెలిపిస్తే, తెల్ల రేషన్ కార్డ్ ఉన్న 93 లక్షల కుటుంబాలకు ఐదు లక్షల బీమా సదుపాయం, అన్నపూర్ణ పథకం కింద అందరికీ సన్న బియ్యం, దశలవారీగా ఆసరా పెన్షన్ 5 వేల 16 లు, దివ్యాంగులకు 6వేలు, రైతుబంధు 16,000, అగ్రవర్ణ పేదలకు ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకులాల నిర్మాణం,
కెసిఆర్ ఆరోగ్య రక్ష కింద ఆరోగ్య బీమా పరిమితిని 15లక్షల పెంపు, అర్హులైన పేద కుటుంబాల మహిళలకు సౌభాగ్య లక్ష్మి కింద నెలకు 3000 రూపాయలు, మహిళా సమాఖ్య సొంత భవనాలు, కుల మతాలకు అతీతంగా ఇల్లులేని ప్రతి ఒక్కరికి పక్కా గృహాలు నిర్మిస్తామని తెలిపారు.
మంత్రి ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ బిజెపి లకు చెందిన వందలాదిమంది నేతలు కార్యకర్తలు, భీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరందరికీ గులాబీ కండవాలతో మంత్రి జగదీష్ రెడ్డి ఆహ్వానం పలికారు.