Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అభివృద్ధి చేశాను ఓటు వేసి … గెలిపించండి

ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే తెలంగాణ అభివృద్ధి

తుంగతుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి నవంబర్ 11 నిజం చెపుతాం న్యూస్

తెలంగాణ ముఖ్యమంత్రిగా మూడోసారి కేసీఆర్ రావాలన్న తుంగతుర్తి అభివృద్ధి సాధించాలంటే నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు.

శనివారం మండల పరిధిలోని ఏనా కుంట తండా మానాపురం రావులపల్లి ఎక్స్ రోడ్ రావులపల్లి బాపన్బావి తండా గొట్టిపర్తి వెంపటి సింగారం తండా కాశీ తండ గ్రామ పంచాయతీలలో వీధులు తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని కోరుతూ ఆట పాటల నడుమ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పింఛన్లు కళ్యాణ లక్ష్మి మిషన్ కాకతీయ మిషన్ భగీరథ రైతుబంధు రైతు బీమా పథకాలే కాకుండా గెలిచిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం 400కే గ్యాస్ సిలిండర్ తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షల ప్రమాద బీమా సౌకర్యం నియోజకవర్గంలోని దళితుల అందరికీ దళిత బందును ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు .

24 గంటలు కరెంటు కావాలన్నా, పథకాలన్నీ తిరిగి పొందాలన్నా మూడోసారి ముచ్చటగా కారు గుర్తుకు ఓటు వేసి, అత్యధిక మెజార్టీ గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ బిజెపి మాయమాటలను ప్రజలు నమ్మవద్దని కోరారు.

ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గుజ్జాదీపిక యుగంధర్ రావు డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య గుండ గాని రాముల గౌడ్ వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, మార్కెట్ వైస్ చైర్మన్ కేతిరెడ్డి గోపాల్ రెడ్డి,

మాజీ మార్కెట్ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్, దొంగరి శ్రీను, మట్టిపెల్లి వెంకట్, గ్రంధాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్ గోపగాని శ్రీను గుణ గంటి సంతోష్, ఎంపీటీసీ కేతిరెడ్డి లతారెడ్డి వివిధ గ్రామాల సర్పంచ్ చందా వెంకన్న వెంకన్న నాయక్ యాకో నాయక్ చెరుకు పరమేష్ విజ్జు పూర్ణ నాయక తదితరులు పాల్గొన్నారు.