Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కాషాయ జెండాలతో జనసంద్రంగా నిర్మల్ పట్టణం

*– నామినేషన్ ర్యాలీకి వేలాదిగా తరలివచ్చిన ప్రజలు.*

*– అడుగడునా నీరాజనాలు పలికిన అభిమానులు, కార్యకర్తలు..*

*– అట్టహాసంగా నామినేషన్ వేసిన బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి..*

*– నామినేషన్ కు హాజరైన ఈటెల రాజేందర్..*

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో నవంబర్ 10 (నిజం చెపుతాం)

నిర్మల్ పట్టణం జనసంద్రంగా మారింది. కాషాయ జెండాలు రెపరెపలాడాయి. నిర్మల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా గ్రామ గ్రామం నుండి వేలాదిగా జనాలు, అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పడుతూ మహేష్ అన్న జిందాబాద్.. కాబోయే ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అంటూ నినాదాలు చేశారు. నామినేషన్ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి దంపతులను మీద పండితులు ఆశీర్వదించారు అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీతో నామినేషన్ కు బయలుదేరి వెళ్లారు.

 

*అడుగడునా నీరాజనాలు..*

 

బీజేపీ ఎమ్మల్యే అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా నిర్మల్ నియోజకవర్గం నుంచి వేల సభ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇసుక వేస్తే రాలనంతగా అభిమానులు తరలివచ్చారు. మహేశ్వర్ రెడ్డి నివాసం నుంచి రిటర్నింగ్ అధికారి ఆర్డీవో కార్యాలయం రావడానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. యువకులు డీజే పాటలపై నృత్యాలు చేస్తూ సందడి చేశారు.

 

*వేదపండితుల ఆశీర్వచనాలు..*

 

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా వేదపండితులు మహేషన్న దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. తన నివాసంలో వేదపండితులు ఎమ్మెల్యేగా గెలుపొందాలని ఆశీర్వదించారు.

 

*నామినేషన్ కు హాజరైన ఈటెల రాజేందర్..*

 

ఏలేటి మహేశ్వర్ రెడ్డి నామినేషన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాజరయ్యారు మహేశ్వర్ రెడ్డితో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు. కార్యకర్తలు ఈటెల రాజేందర్ ను గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మరింత అభివృద్ది జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని దేశంలో కాంగ్రెస్ ఎక్కడ లేదని అన్నారు. ఈ ఎన్నికల్లో కమలం పువ్వుకు ఓటు వేసి బీజేపీని గెలిపించాలని కోరారు.

 

*రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాల సమర్పణ..*

 

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. జిల్లా అధ్యక్షులు అంజుకుమార్ రెడ్డితో కలిసి తన నామినేషన్ పత్రాలు సమర్పించారు.

 

*ఈ జోష్ చూస్తుంటే నిర్మల్ లో కాషాయ జెండా ఎగరడం ఖాయం: ఏలేటి..*

 

ఈ జోష్ చూస్తుంటే నిర్మల్ లో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బీజేపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. నిర్మల్ లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అరాచకాలు దోపిడి పెరిగిపోయిందని ఆరోపించారు. దేశంలో ఎక్కడ అంత దోపిడీ నిర్మల్ లో జరిగిందని అన్నారు. 1000 ఎకరాల పైన అసెంబ్లను కబ్జా చేసి అక్రమంగా బి1 పట్టాలు సృష్టించారని అన్నారు మాస్టర్ ప్లాన్ పేరుతో రెండు వేల కోట్లు దోచుకున్నారని ద్వియపడ్డారు 42 ఉద్యోగాలను అమ్ముకున్న దుర్మార్గ మంత్రి అని మండిపడ్డారు. నిర్మల్ చుట్టుపక్కల పచ్చని పొలాలను ఇండస్ట్రియల్ జోన్ గా మార్చారని అన్నారు. నిర్మల్ లో నిమ్మ నాయుడు కాలం నాటి చెరువులు, కందకాలను మంత్రి ఆయన బంధువులు కబ్జాలు చేయడంతో చిన్నపాటి వర్షాలకు నిర్మల్ మునిగిపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఎన్నికలకు హైదరాబాదు నుండి షేర్వానీని పిలిపించే మంత్రి ఈ ఎన్నికల్లో పిలవాలని సవాల్ విసిరాడు. గత పదిలలో దోచుకున్న సొమ్ముతో గెలవాలని చూస్తున్న మంత్రికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రైతులు ఆరుకాలం కష్టపడి పండించిన పంటను కోతల పేరుతో ప్రభుత్వం దోచుకుందని వండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రైలు వస్తుందంటూ ఇక్కడి ప్రజలను మభ్యపెడుతూ ఓట్లు దండుకునే మంత్రికి బుద్ధి చెప్పాలన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటు చేసి మద్దతు ధర ప్రకటించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తే దద్దమ్మ మంత్రి నేనే మెడికల్ కళాశాల తీసుకొచ్చిననని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవ చేసారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో దళిత బంధు అమలు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ఎందుకు దళిత బంధు పథకాన్ని అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని అన్నారు.

 

*ఈ నెల 26న నిర్మల్ కు ప్రధాని మోడీ..*

 

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 26న దేశ ప్రధాని నరేంద్ర మోడీ నిర్మల్ జిల్లా కేంద్రానికి రానున్నారని తెలిపారు. నేను మాటిస్తున్న గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మల్ ను స్మార్ట్ సిటీ చేస్తానని హామీ ఇచ్చారు. బీడీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చెస్ట్ ఆసుపత్రిని నిర్మిస్తానని తెలిపారు. వచ్చే 20 రోజులు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని వచ్చే ఐదేళ్లు ఓ కుటుంబ సభ్యునిగా సేవ చేస్తానని తెలిపారు. రైతుల పండించిన పంటను కొనుగోలు చేస్తే బాధ్యత తీసుకొని 48 గంటల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయిస్తారని పేర్కొన్నారు.

 

*గురు శిష్యులకు బుద్ధి చెప్పాలి..*

 

ఇన్నేళ్లు ఒకే పార్టీలో ఉంటూ ప్రభుత్వ ఓటు బ్యాంకు చీల్చకుండా ఉండేందుకు గురు శిష్యులు విడిపోయి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ప్రజలు ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి వేల కోట్లు సంపాందించి, కుటుంబ సభ్యులకు ఉన్నత పోస్టులు అనుభవించి డిపాజిట్ రాని వ్యక్తి మండిపడ్డారు. ఇద్దరు నేతలు కలిసి స్వర్ణ కాలువపై చెక్ డ్యామ్ లు నిర్మించి రైతులకు కన్నీళ్లు మిగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్లు దోచుకున్న డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తున్న గురు శిష్యులకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.