Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఉత్తమ్ పై గెలిస్తే సైదిరెడ్డికి మంత్రి పదవి ఖాయం…?

అధిష్టానం నుండి స్పష్టమైన సంకేతాలు..?

నిజమేనంటున్న బిఆర్ఎస్ శ్రేణులు

మరోసారి సీఎం రేసులో తమ నేత ఉన్నాడంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రేస్ నాయకులు

హుజూర్ నగర్ లో జోరుగా సాగుతున్న ప్రచారాలు

హైదరాబాద్, నవంబర్ (నిజం చెపుతాం):

హుజూర్ నగర్ లో ఓటమి ఎరుగని నేతగా ఉన్న ఉత్తమ్ ను ఓడిస్తే ఈ సారి  శానంపూడి సైదిరెడ్డికి మంత్రి పదవి దక్కనుందన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. ఉత్తమ్ మాాజీ మంత్రి, మాజీ టీపీసీసీ అధ్యక్షులు కావడం, హుజూర్ నగర్ లో ఇంత వరకు ఓటమి ఎరుగక పోవడంతో ఆయనను ఓడిస్తే సైదిరెడ్డికి ఖచ్చితంగా మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్లు అధిష్టానం కూడా హామీ ఇచ్చినట్లుగా బిఆర్ఎస్ శ్రేణులు తెలుపుతున్నాయి. సైదిరెడ్డి స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండటం, తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే తమ నేతను గెలిపిస్తాయని,  ఈ దిశగా సైదిరెడ్డి ఒక్కో అడుగులు వేసుకుంటూ వెలుతున్నాడని సైదిరెడ్డి గెలుపు ఖాయమనే బీఆర్ఎస్ శ్రేణులు తెలుపుతున్నాయి. కాంగ్రేస్ పార్టీ మాత్రం తమ నాయకుడు మరోసారి సీఎం రేసులో ఉన్నాడని ఈ సారి సీఎం కావడం ఖాయమనే ప్రచారం చేస్తున్నారు. హుజూర్ నగర్ లో ఒకరు గెలిస్తే సీఎం, మరోకరు గెలిస్తే మంత్రి పదవి  తమ నియోజకవర్గానికి  రానుందన్న ప్రచారంతో భవిష్యత్ లో తమ  నియోజకవర్గ రూపురేఖలు మారిపోనున్నాయని నియోజకవర్గ ప్రజలు తెలుపుతున్నారు.

హోరాహోరీ పోరు…

హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీల మధ్య హోరాహోరీ సమరం జరగనుంది. కాంగ్రేస్ పార్టీ అభ్యర్థిగా మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు  నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తుండగా, బీఆర్ఎస్ అభ్యర్థిగా  శానంపూడి సైదిరెడ్డి బరిలో ఉన్నారు. 2009, 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో వరుసగా ఇక్కడ ఉత్తమ్ గెలిచి హ్యట్రిక్ కొట్టాడు.  ఆ తర్వాత ఉత్తమ్ ఎంపీగా గెలువగా, శానంపూడి సైదిరెడ్డి  ఉప ఎన్నికల్లో ఉత్తమ్ సతీమణి పద్మావతిపై భారీ విజయం సాధించి 4 సంవత్సరాలు పాటు ఎమ్మేల్యేగా నియోజకవర్గంలో తన ముద్రను వేసాడు.

కాంగ్రేస్ నుండి వచ్చిన వారు తిరిగి అదే పార్టీలోకి జంప్…

బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్నాళ్ళుగా   కాంగ్రేస్ పార్టీలో అధికారం చెలాయించిన నాయకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. అధికారంలో ఉండి తమ పనులను చేయించుకుని ఎన్నికల నోటిఫికేషన్ పడగానే తమ స్వంత పార్టీలోకి జంప్ అయ్యారని కాంగ్రేస్ పార్టీ నుండి వచ్చిన శ్రేణులు తిరిగి కాంగ్రేస్ పార్టీలోకి వెళ్ళిపోయారని వారు పోవడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి మేలు జరిగింది కానీ ఎలాంటి ఇబ్బంది లేదని నియోజకవర్గ బిఆర్ఎస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. నాయకులు వెళ్లి పోయారని కార్యకర్తలు తమ వెంటే ఉన్నారని చెబుతున్నారు.

 

మరో సారి సీఎం రేసులో ఉన్నాడు సహాకరించండి…?

హుజూర్ నగర్ బరిలో బీఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీలతో పాటు బిజేపీ, ఇండియన్ ఫార్వడ్ బ్లాక్ , బీఎస్పీ పార్టీలు పోటీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. బిజేపీ, ఇండియన్ ఫార్వడ్ బ్లాక్ , బీఎస్పీ పార్టీల వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఉండటంతో ఇబ్బందిగా మారుతుందని, అలా కాకుండా కాంగ్రేస్ అభ్యర్థి సీఎం రేసులో ఉన్నారని తమకు సహాకరించాలని,  ఇతర అభ్యర్తులు కూడా తమతో సహాకరించాలని వారితో కాంగ్రేస్ నాయకులు బేరసారాలు ఆడుతున్నారన్న ప్రచారం కూడా ఉంది.