Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మాజీ కేంద్రమంత్రి బలరాం నాయక్ కాంగ్రెస్ కు రాజీనామా?

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, నవంబర్ 7,( నిజం న్యూస్):

కాంగ్రెస్ అధిష్టానం మహబూబాబాద్ నియోజకవర్గం నుండి మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ కు అసెంబ్లీ టికెట్ ఇవ్వనందుకు కాంగ్రెస్ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు అత్యంత విశ్వసనీయ వర్గాల వినికిడి.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత దయనీయ పరిస్థితులలో ఉన్నప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ కొరకు త్యాగం చేసి ఇప్పటివరకు పార్టీకి అండగా ఉన్నామని రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బలరాం నాయక కుమారుడు సాయి శంకర్ “నిజం” జర్నలిస్టుతో మాట్లాడుతూ అన్నారు.

తన తండ్రి మంత్రిగా ఉన్నప్పుడు మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్రం నుండి ఎన్నో అభివృద్ధి పనులు మంజూరు చేయించారని సాయి శంకర్ అన్నారు.

ప్రస్తుతం తన తండ్రికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ నిరాకరించడం తమకు తీవ్ర బాధను, ఆవేదనను కలిగించిందని సాయి శంకర్ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. సుమారు తన జాతికి సంబంధించిన ఓటర్లు 45 లక్షల మంది ఉన్నారు.

జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు ఎక్కడ టికెట్ ఇచ్చిన పర్వాలేదని అన్న కూడా తన తండ్రికి టికెట్ రాకుండా కాంగ్రెస్ లోని ఒక వర్గం తీవ్రంగా వ్యతిరేకించిందని, డబ్బు ప్రభావం ఎక్కువగా చూపడం, డబ్బులు ఇచ్చిన వారికి టికెట్టు ఇవ్వడం జరిగింది అని ఆయన వాపోయారు.

కష్టకాలంలో పార్టీని ప్రజల్లో నిలిపిన వారికి పార్టీ మొండి చెయ్యి చూపిందని సాయి శంకర్ ఆరోపించారు.

తన తండ్రి బలరాం నాయక్ ఢిల్లీ నుండి సాయంత్రం రాగానే పార్టీకి అన్ని పదవులకు రాజీనామా చేస్తాడని సాయి శంకర్” నిజం” రిపోర్టకు ఫోన్ లో తెలిపారు.