రానున్న విక్రమ్ సినిమాలో ఇలా చేశాడా?
ప్రస్తుతం తమ ఇండస్ట్రీ నుండి ఎన్నో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి.. ఏ గుర్తింపు లేకుండా వారి సొంతంగా వచ్చిన హీరోలలో విక్రమ్ కూడా ఒకరు.. డైలాగ్ చెప్పకుండా సైగలతో సినిమాలు చేయగల సత్తా ఉన్న హీరోలలో హీరో విక్రమ్ కూడా ఒకరు.. 2024 జనవరి 26న విడుదల విడుదల కాడ ఉన్న తంగలాన్ అనే సినిమాతో ప్రేక్షకులకు ముందుకు రానున్నాడు అయితే ఈ సినిమాలో ఇలా చేశారని పలు కామెంట్లు వస్తున్నాయి అది నిజమో కాదో చూద్దాం..
విక్రమ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బాలా తెరకెక్కించిన తమిళ సినిమా ‘పితామగన్’. 2003లో విడుదలైన ఈ చిత్రం తమిళనాట సంచలనం సృష్టించింది. తెలుగులో ‘శివపుత్రుడు’ పేరుతో విడుదలై ఘన విజయం అందుకుంది. ఈ చిత్రంలో విక్రమ్ పాత్రకు అరుదైన గుర్తింపు వచ్చింది. మాటలు లేకుండా కేవలం హావభావాలతో భావోద్వేగాలని అద్భుతంగా పాడించారు. ఇప్పుడు మరోసారి అలాంటి మ్యాజిక్్న రిపీట్ చేయనున్నారని అనిపిస్తోంది. విక్రమ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘తంగలాన్’. పా రంజిత్ దీన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చుంది. అయితే ఈ చిత్రంలో విక్రమ్ పాత్రకు మాటలు లేవు. ఈ విష యాన్ని స్వయంగా విక్రమ్ వెల్లడించారు. అయితే హీరో విక్రమ్ గతంలో చేసిన సినిమాల్లో ‘శివ’ పుత్రుడు’, నాన్న, ‘అపరిచితుడు’.. ఇలాంటి చిత్రా ల్లాగే ‘తంగలాన్ కూడా ఓ విభిన్న కథతో మీ ముందుకొస్తోంది. ఈ సినిమాలో నాకు డైలాగులు లేవు. ‘శివపుత్రుడు’ తరహాలో ఉంటుంద అని చెప్పుకొచ్చారు విక్రమ్. మాటలు లేకుండా శివపుత్రుడుతో సంచలనం సృష్టించారు విక్రమ్. మాటలు లేకుండా తన నటనతో తన సైగలతో అద్భుతమైన నటనను నటించి ప్రేక్షకులు అలరించగల హీరోలలో హీరో విక్రమ్ కూడా ఒకరు.. అయితే వేచి చూడాల్సి ఉంది ఈ సినిమా ఎలా ఉంటుందో ఎంత బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేస్తుందో ఈ సినిమా ఆయన చెప్పినట్టుగానే డైలాగ్స్ లేకుండా ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది..