శాసన మండలికి వర్మ హీరోయిన్

బాలీవుడ్ నటి ఊర్మిళా మతోండ్కర్ మహారాష్ట్ర శాసన మండలిలో ఎమ్మెల్సీగా అడుగుపెట్టనున్నట్టు తెలుస్తున్నది. శాసనమండలికి గవర్నర్ కోటాలో 12మంది సభ్యులను నామినేట్ చేయాల్సి ఉంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సభ్యుల పేర్లను సిఫారసు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర క్యాబినెట్ గురువారం సమావేశమైంది. ఈ సందర్భంగా ఊర్మిళ పేరును కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు సమాచారం.