Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కాంగ్రెస్ను నమ్మితే అరిగోస పడతాం

 

55ఏళ్లు అధికారమిస్తే మన బతుకులు ఆగం చేశారు:

సబ్బండ వర్గాలకు లబ్ధి చేకూరేలా టిఆర్ఎస్ పార్టీ
మేనిఫెస్టో:

మానవీయ కోణంలో ఆలోచన చేసే మనసున్న మారాజు సీఎం కేసీఆర్:

నా ఆడబిడ్డల ఆరోగ్య రక్షణ కోసం మెడికల్ కళాశాలను ప్రారంభింపజేశా:

ఆరు నెలలకు ఒకసారైనా మహిళలు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి:

ఎన్నికల్లో ఆదరించండి ,కార్ గుర్తుకు ఓటు వేసి గెలిపించండి:

*రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్

 

పెద్దపల్లి జిల్లా ప్రతినిధి:పాలకుర్తి: అక్టోబర్ 31:
(నిజం చెపుతాo)…కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం, కుట్ర అని ,కాంగ్రెసు ను నమ్మితే మోసపోతాం ,అరిగొస పడతామని ,కాంగ్రెస్ పార్టీ
చెబుతున్న దొంగ మాటలను ప్రజలు ఎవరు నమ్మవద్దని, వారికి బుద్ధి వచ్చేలా రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని రామగుండం శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ అన్నారు.పాలకుర్తి మండలం బసంత నగర్ లో ప్రజా అంకిత యాత్రలో భాగంగా ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రామగుండం నియోజకవర్గానికి ఏమీ చేయని వారు ఒక అవకాశం ఇవ్వాలని దొంగ మాటలు చెప్తూ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని ,వారి మోసపూరిత మాటలను నమ్మితే మన బతుకులు ఆగం కావడం గ్యారెంటీ అన్నారు. రామగుండం నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రజ సంక్షేమమే కోసమే మా అరటామని… పదవుల కోసం కాంగ్రెసోళ్ల అరాటమన్నారు.

 

ఈ ప్రాంత ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలువాలని మీ రుణం తీర్చుకోవడానికి మెడికల్ కళాశాల ఎర్పాటు చేయుంచానని అన్నారు. జిల్లా కెంద్రాల్లో మెడికల్ కళాశాలలు ప్రభుత్వం మాంజూరు చేసిన సందర్భంలో సిఎం కేసీఆర్‌ ని ఓప్పించి మెప్పించి మెడికల్ కళాశాలను 500 కోట్ల తో ప్రారంభించి కార్పోరేట్ వైద్యం పెద కుటుంభాలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆడబిడ్డలంతా ఆరోగ్యాల పట్ల శ్రద్ద వహించాలని తన కుటుంబంలో జరిగిన విధంగా మరే కుటుంభంలో జరుగవద్దన్నారు. 6నెలలకోసారి మహిళలు వైద్య పరిక్షలు చేయుంచుకోవాలనీ, మెడికల్ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళ పేరిట పధకం తీసుకువచ్చిందన్నారు.
రామగుండం లో జరిగిన అభివృద్ధి చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన ప్రచారాలు చేస్తుందన్నారు.
తెలంగాణ భవితకు భరోసా గా సబ్బండ వర్గాలు లబ్ధి చేకూరేలా టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రూపోందిచారని, ప్రజా ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోలో ప్రకటించిన దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజహిత మ్యానిఫెస్టో రూపొందించారని
రైతు బంధు ఎకరాకు ఏడాదికి రూ.16,000, తెల్ల కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కెసిఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా పథకం, ఒక కుటుంబానికి 4000 రూపాయలు భీమా చెల్లించి ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పన, తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా ప్రతి రేషన్ కార్డు దారునికి సన్న బియ్యం పంపిణీ, ఆసరా పింఛన్లు రూ.5 వేలకు పెంపు, వికలాంగుల పింఛన్ 6 వేలకు పెంపు,సౌభాగ్య లక్ష్మీ పథకం అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.3 వేలు అర్హులైన లబ్ధిదారులకు రూ. 400 రూపాయలకే సిలిండర్ ఆరోగ్యశ్రీ పరిమితి 15 లక్షలకు పెంపు చేయడం జరిగిందన్నారు. ప్రజలందరు మళ్లీ తమకు మద్దతూగా నిలువాలనీ కారు గుర్తు కు ఓటు వేసిగెలిపించాలన్నారు. బసంత్ నగర్ గ్రామ సర్పంచ్ కట్టగోల వేణుగోపాల్ రావు అధ్వర్యంలో జరిగిన
ఈ కార్యక్రమం లో వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, బీ.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మూల విజయ రెడ్డి, బీ.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఇంజపురి నవీన్ కుమార్ ,నాయకులు అల్లం రాజన్న ,ముల్కల కొంరయ్య ,ముత్యం లక్ష్మన్, సర్వర్ ,దేవి లక్ష్మి నర్సయ్య, కాదాసు సంపత్ ,తిరుపతి రెడ్డి, మేకల కుమార్ ,ఆంజనేయులు, అసిఫ్ ,రవి కుమార్, సూజాత, సత్తయ్య , అధిక సంఖ్యలో ప్రజలు,తదితరులు పాల్గొన్నారు.