Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దొరల పరిపాలనకు స్వస్తి చెప్పండి

*హస్తాన్ని నమ్మండి కారును వదలండి!

చర్ల అక్టోబర్ 31 (నిజం చెపుతాం) దొరల పరిపాలనకు షష్టి చెప్పి పేదల పార్టీ కాంగ్రెస్ హస్తం గుర్తుకు ఓటేద్దామని ఎన్నికల ప్రచారంలో భాగంగా భద్రాచలం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొదెంవీరయ్య గెలుపును ఆకాంక్షిస్తూ

మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు చీమలమర్రి మురళి చీమకుర్తి భద్రం రామకృష్ణ (ఆర్కే) మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో విస్తృత ప్రచారం చేశారు

ఈ సందర్భంగా ప్రజలకు మేనిఫెస్టోలో పెట్టిన గ్యారంటీ పథకాలపై ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనపై ఎత్తిచూపుతూ పార్టీ వైఫల్యాలను ఎండగట్టుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు

కారునినమ్మొద్దని హస్త గుర్తుకు మీ పవిత్రమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని మీ భవిష్యత్తును కాపాడుకోవాలని యువతకు విజ్ఞప్తి చేస్తున్నారు

ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలకం నరేంద్ర రుంజ రాజారావు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు