Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

1లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తాం

గాదరి కిషోర్ ను లక్ష మెజార్టీతో …గెలిపించాలి.

బహిరంగ సభకు హాజరైన అశేష ప్రజానికం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్

సూర్యాపేట ప్రతినిధి అక్టోబర్ 29 నిజం చెపుతాం న్యూస్

ప్రజలు విచక్షణ తో ఆలోచన చేసి ఓటయ్యాలి…

తుంగతుర్తి ప్రాంతం పోరాటాల గడ్డ…. గత ప్రభుత్వాల హయం లో కరువు బారిన పడ్డది..ఇవ్వాళ తుంగతుర్తి పచ్చగా మారింది..

కాల్వలు, చెరువులలో కళ కళ లాడుతుంది..గోదావరి జలాలు అద్భుతమైన ప్రగతి తెచ్చింది.. లక్షన్నర ఎకరాల్లో పంటలు పండుతున్నాయి… అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

తిరుమలగిరిలో ఆదివారం తలపెట్టిన సమర శంఖారావం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. బునాది గాని కాల్వల ద్వారా నీళ్లు అందిస్తాము…ఈ నియోజకవర్గంలో టోటల్ గా

1లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తాము…తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కాంగ్రెస్ వంచించింది… మనతో పొత్తు పెట్టుకొని కూడా మోసం చేసింది.. చివరకు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అని పోరాటం చేస్తే స్వరాష్ట్రం సాదించుకున్నాం…తెలంగాణ కోసం యువత ఆత్మహత్య చేసుకున్నారు…ఎట్టకేలకు గమ్యాన్ని ముద్దాడాము..

మన ప్రభుత్వం లోఆసరా పెన్షన్ పెంచుతూ వచ్చాము.. కల్యాణ లక్ష్మీ పథకం రూపాయలను కూడా పెంచుకుంటూ వచ్చాము.. ఆదాయాన్ని పెంచి, పంచాము…రైతు బంధు పథకాన్ని స్టార్ట్ చేసాము..సక్సెస్ అయింది…తెలంగాణ లో ఆత్మహత్య లు, వలసలు వుండే.. ఇవ్వాళ అన్నిటికీ చరమగీతం పాడాము.అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నాం..

ఇది అందరికి గర్వకారణం.తుంగతుర్తి లో ఎండ కాలంలో కూడా నీళ్లు మత్తడి దుంకుతున్నాయి.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చాడు…మనకు పాఠాలు చెప్తాడు… కర్ణాటక ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి రైతులకు 5 గంటలు ఇస్తున్నాం అంటున్నాడు..

ఇలాంటి మోసకారులు కూడా తెలంగాణ కు వచ్చి నీతులు చెవుతారు… తస్మాత్ జాగ్రత్త….అందరి పట్ల అప్రమత్తంగా ఉండాలి…నల్గొండ దామరచర్ల లో 30 వెల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్ కడుతున్నాం….దళిత బంధు పథకం అద్భుతమైన మార్పు తెస్తుంది…

దశాబ్దాలుగా దళితులు మోసానికి గురవుతున్నారు… అందుకే తెలంగాణ లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తునం.. ఈ నియోజకవర్గంలో ఫైలెట్ ప్రాజెక్టుగా తిరుమల గిరి మండలం లో అమలు చేసాము.

ఈ నియోజకవర్గ ములో ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ మంచి పనులు చేశారు….గాదరి కిషోర్ ను లక్ష ఓట్ల మెజారిటీ తో గెలిపించండి..ఉద్యమం లో నాతో పని చేసాడు.. గొప్ప పోరాటం చేసాడు…

ఈ ఎన్నికల్లో కిషోర్ మంచి మెజార్టీతో గెలిలవాలి..గాదరి కిషోర్ ను లక్ష మెజార్టీతో గెలిపిస్తే నియోజకవర్గంలో మొత్తం దళిత బంధు అమలు చేస్తాం..

గాదరి కిషోర్ యువకుడు, ఉత్సాహవంతుడు… గెలిపించుకోండి…కాంగ్రెస్ కు చాన్స్ ఇస్తే తెలంగాణ ఆగం అవుతుంది….కరంట్ ఖతం అవుతుంది… కాంగ్రెస్ పార్టీ ధరణిని రద్దు చేస్తాం అంటున్నారు ..అది ఎంత ప్రమాదమో మిరే ఆలోచన చేయాలి…

ధరణి రావడం వల్ల అవినీతి అంతం అయింది… ధరణి రద్దు అయితే అవినీతి రాజ్యం వస్తుంది..మళ్ళీ కొట్లాటలు వస్తాయి… రైతు బంధు కూడా రాదు… ..

ధరణి రైతులకు గుండె కాయ లాంటిది…రైతు బంధు వెస్ట్ అని కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్రెడ్డిఅంటున్నాడు .వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పాలి అని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, సూర్యాపేట జెడ్పి చైర్ పర్సన్ గుజ్జా దీపిక యుగంధర్ రావు, డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు

తాటికొండ సీతయ్య గుండ గాని రాముడు గౌడ నన్ను రామచంద్రారెడ్డి మార్కెట్ మాజీ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్ ప్రజా ప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు…