*సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కాంట్రాక్ట్ కార్మికుల కు ఓటు హక్కు కల్పించాలి*

సింగరేణి లో జరగబోయే గుర్తింపు సంఘం ఎన్నికల్లో సింగరేణి లో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు ఓటు హక్కును కల్పించాలని సీఐటీయూ అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం (ఎస్సీకేఎస్-సీఐటీయూ) రాష్ట్ర కార్యదర్శి బండిరాజేష్ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఓ.సి-4 జరిగిన ఫిట్ మీటింగ్ లో బండిరాజేష్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల పట్లా సింగరేణి యాజమాన్యం,రాష్ట్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని అన్నారు.
యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులకు 2013 జనవరి నుండి అమలు కావాల్సిన కోల్ ఇండియా వేతనాలు అమలు చేయడంలేదు, ఉత్పత్తి లో ప్రత్యేకంగా, పరోక్షంగా భాగస్వామ్యం అవుతున్నా కాంట్రాక్ట్ కార్మికులకు లాభాలలో వాటా ఇవ్వడం లేదు
కన్వీయన్స్ డ్రైవర్ కు స్కిల్డ్ వేతనాలు ఇవ్వడం లేదు,సీఎంపీఎఫ్ అమలు చేయడం లేదు,బెల్ట్ క్లీనింగ్ కార్మికులకు సెమి స్కిల్డ్ వేతనాలు అమలు చేయడం లేదు,స్కిల్డ్ పనులు చేయించుకోని ఆన్ స్కిల్డ్ వేతనాలు చెల్లిస్తున్నారు.
కాంట్రాక్ట్ కార్మికులుకు ఓటు హక్కు ఉంటే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.ప్రభుత్వ రంగ సంస్థ ఐన సింగరేణి లో కార్మిక చట్టాలు,హక్కులు అమలు కాకపోతే రాబోయే రోజుల్లో సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేస్తే కాంట్రాక్ట్ కార్మికులవి బానిస బ్రతుకులుగా అయే అవకాశం ఉందని అందు కోసం కాంట్రాక్ట్ కార్మికులు సంస్థ కోసం,తన హక్కుల కోసం యాజమాన్యం పై పోరాటానికి సిద్దం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కొడిశాల రాములు, కాంట్రాక్ట్ కార్మికులు తాటి వెంకటేశ్వర్లు,రామారావు, రమేష్, శంకర్,అన్నపూర్ణ, పద్మ , కుమారి,తదితరులు పాల్గొన్నారు.