Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కాంగ్రెస్ నాయకుడి రాస లీలలు..?

హుజూర్‌నగర్‌, అక్టోబర్‌ 26(నిజం చెపుతాం):
ఇటీవల బిఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరిన ఒక మండల పార్టీ నాయకుడు హుజూర్‌ నగర్‌ లోని ఒక ఫంక్షన్‌ హాల్లో మహిళతో రాసలీలల్లో మునిగి తేలుతుండగా హుజూర్‌నగర్‌ పోలీసులు గురువారం పట్టుకుని వదిలేసినట్లు తెలిసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్‌నగర్‌ నుండి గుర్తు తెలియని వ్యక్తి తమకు ఫోన్‌ చేసి మాధవరాయనిగూడెం స్టేజీ వద్ద ఉన్న ఫంక్షన్‌ హాల్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఫంక్షన్‌ హాల్‌లోకి వెళ్లి పరిశీలిస్తుండగా ఒక గదిలో హుజూర్‌నగర్‌ మండలానికి చెందిన ఒక మండల స్థాయి నాయకుడు, అదే గ్రామానికి చెందిన వివాహిత మహిళతో ఏకాంతంగా ఉన్నట్లు తెలిపారు. వ్యభిచారం కేసులో అయితే తాము అరెస్ట్‌ చేస్తాం కాని ఏకాంతంగా ఉన్న వారిని తమకు అరెస్ట్‌ చేసే అధికారం లేకపోవడంతో ఉన్నతాధికారుల సలహా మేరకు వదిలేసినట్లు తెలిపారు.

చెప్పేది శ్రీరంగ నీతులు…దూరేది…
నేను స్వచ్ఛమైన నాయకుడిని, నిజాయితీపరున్ని అని డబ్బాలు కొట్టుకునే ఈ నాయకుడు పరాయి వివాహిత మహిళతో పర్సనల్‌ గా హుజూర్‌నగర్‌ లోని ఒక ఫంక్షన్‌ హాల్‌లో పోలీసులకు దొరికాడని తెలిసిన గ్రామస్తులు విస్తుపోతున్నారు. చెప్పేవేమో శ్రీరంగనీతులు చేసే పనులేమో ఇలా ఉంటాయా అని గుసగుసలాడుతున్నారు.

దొరికిన మాట నిజమే…సీఐ రామలింగారెడ్డి
పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఒక ఫంక్షన్‌ హాల్లో తనిఖీలు చేపట్టగా ఒక గదిలో సదరు నాయకుడు మహిళతో ఉన్నారని సిబ్బంది సమాచారం ఇవ్వడంతో చట్టం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం లేకపోవడంతో వదిలేయమని చెప్పినట్లు తెలిపారు.