ప్రారంభమైన మా ఊరి ప్రేమ కథ సినిమా షూటింగ్…
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎటువంటి భారీ అంచనాలు ఎటువంటి ప్రమోషన్లు లేకుండా చిన్న సినిమాలుగా వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే..
తాజాగా మా ఊరి ప్రేమ కథ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు అతి త్వరలో రాబోతుంది..
వారాహి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం “మా ఊరి ప్రేమ కథ ..
ఈ చిత్రం షూటింగ్ నిన్న ఎర్రవరం లోని శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించడం జరిగింది…
నటీనటులపై ప్రముఖ డైరెక్టర్ రమేష్ జక్కుల గారు క్లాప్ కొట్టగా… సీనియర్ నటులు చలపతి గారు కెమెరా ఆన్ చేశారు…
హుజూర్నగర్ పరిసరాల్లోనే జరిగిన నిజ జీవిత ప్రేమ కథ ఆధారంగా… తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డైరెక్టర్ అంజి అయాన్… స్క్రీన్ ప్లే మాటలు పాటలు ప్రిన్సి వెంకట్… కో డైరెక్టర్ గా రామస్వామి, పనిచేస్తున్నారు…
ఈ చిత్రం మూడు షెడ్యూల్లో పూర్తి చేసి… పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని 2024 మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని…
చిత్ర డైరెక్టర్ అంజి అయాన్ తెలపడం జరిగింది… ఈ కార్యక్రమంలో నూక పొంగు సతీష్..
నరసింహారావు… నటీనటులు అసిస్టెంట్ డైరెక్టర్లు అనిల్…స్వాతి, హీరోయిన్… గ్రామ ప్రజలు… నటీనటులు పాల్గొనడం జరిగింది…