కష్టకాలంలో కనపడని ఓట్లు అడిగే నాయకులను నిలదీయండి
– నమ్మి ప్రజలు గెలిపిస్తే తెల్లారే కల్లా హుజూర్నగర్ పారిపోయిన ఉత్తం
– చీకటి ఒప్పందంతో కుట్ర పన్నుతున్న విష పురుగులు
– సాండ్ మైన్ వైన్ ప్రైవేట్ క్లబ్బులకు తెరలేపింది నీవు కదా
– హత్యా రాజకీయాలతో శవాలపై పేలాలు ఏరుకున్న ఘన చరిత్ర నీది
– మంత్రి పదవుల కోసం నిన్నటి వరకు బేరసారా లాడిన కుటిల రాజకీయుడివి
– 2014లో పక్కలో బల్లెంల వెన్నుపోటు పొడిచిన కురువృద్ధుడు
– ప్రతి ఎన్నికలో పట్టణంలో మెజారిటీ ఇచ్చిన ప్రజలను మర్చిపోను
– గెలుపు నిర్ణయమే,, మెజారిటీతో మీ బాధ్యత
రెండు సంవత్సరాల కరోనా కష్టకాలంలో ప్రజలు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతుంటే హైదరాబాద్ ఏసీ గదుల్లో నుండి బయటకు రాని కాంగ్రెస్ అభ్యర్థి ఓట్లు ఇప్పటివరకు ఎక్కడికెళ్లామని నిలదీయాలని బిఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ ఆ పార్టీ పట్టణ బిఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు
శనివారం కోదాడ గునుగుంట్ల అప్పయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు…
తాను గెలిచిన నాటినుండి నిత్యం ప్రజల వెన్నంటి ఉంటూ నేరుగా సంక్షేమ పథకాలను వారి ఇండ్ల కే వెళ్లి అందజేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు
అయితే ఓటమిపాలైన కాంగ్రెస్ నాయకురాలు నియోజకవర్గ ప్రజలతోపాటు కనీసం ఆ పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోలేనీ విషయాన్ని అని గుర్తు చేశారు నాలుగున్నర సంవత్సరాల వరకు గుర్తురాని ప్రజలు ఎన్నికలు రాగానే మళ్లీ అధికార వాంఛతో తనకు ఓటు వేయాలని అభ్యర్థిస్తుంటే ఆ పార్టీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు..
తనపై ప్రజలకు ఉన్న ఆదరాభిమానంతో ఓడిపోతాననే భయంతోనమ్మి ఓట్లేసిన ప్రజలను గాలికి వదిలేసి 2014లో అర్ధరాత్రి కోదాడనువదిలి హుజూర్నగర్ కు పారిపోయిన ఘన చరిత్ర ఉత్తమదని ఎద్దేవా చేశారు..
హత్య రాజకీయాలకు సాండ్ వైను మైను ప్రైవేట్ క్లబ్బులకు తెర తీసిన ఉత్తం దొంగే దొంగ దొంగ అన్నట్లుగా తనపై చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సిరిపురం లో హత్య రాజకీయాలకు తరలిపి శవాలపై పేలాలు ఏరుకున్నట్టుగా వ్యవహరించిన ఉత్తమ్ కు ఓట్లు అడిగే అర్హత లేదన్నారు..
చీకటి ఒప్పందంతో ఇక్కడ పెద్ద మనుషులు అనుకునే నాయకులు ఉత్తంతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తగిన బుద్ధి చెబుతారని ధ్వజమెత్తారు.. మంత్రి పదవుల కోసం తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా సొంత పార్టీని వదిలి బేర సారాలాడిన ఆయన సతీమణికి పరాభవం తప్పదన్నారు..
ప్రస్తుత రాజకీయాలకు నీవు సరిపోవని అప్పటి అధిష్టానం 2014లో తనకు టికెట్ ఖరారు చేస్తే పక్కలో బల్లెంల ఉత్తంతో చీకటి ఒప్పందం చేసుకొని ఊడగొట్టిన కుటిల చరిత్ర మరో పెద్ద మనిషి దని ఆయన ఎవరోఅందరికీ తెలిసిందే అన్నారు..
ప్రతి ఎన్నికలోను కోదాడ పట్టణ ప్రజలు మెజారిటీ ఇచ్చారని తానే రుణపడి ఉంటానని మరింత మెజారిటీ వచ్చే విధంగా ఈ 35 రోజులు శక్తివంచన లేకుండా కృషి చేయాలి అన్నారు
ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు నూతన ఎన్నికల ప్రణాళికను ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించే బాధ్యత శ్రేణులకు శ్రేణులకు పిలుపునిచ్చారు
సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ సర్పంచ్ సత్యబాబు అధ్యక్షత వహించిన
ఈ సమావేశంలో నాయకులు నయీం మధుసూదన్ దేవమణి పద్మజ గట్ల కోటేశ్వరరావు యువతుల కృష్ణయ్య బెజవాడ శ్రవణ్ గంధం పాండుతో పాటు బూత్ కమిటీ బాధ్యులు కౌన్సిలర్లు ముఖ్య నాయకులు పాల్గొన్నారు