Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జిల్లా ఎన్నికల అధికారి ఉత్తర్వులు బేఖాతర్.

__ఎన్నికల నిబంధనలు ఉన్న యతేచ్చాగా సాగుతున్న మున్సిపాలిటీ కాంట్రాక్ట్ పనులు.

__ఓటరును ప్రభావితం చేసే ఎలాంటి అభివృద్ధి పనులు జరగరాదని కలెక్టర్ ఆదేశాలు ఉన్న బేకాతర్.

__మున్సిపాలిటీ డి ఈ దృష్టికి తీసుకు వెళ్లిన పాత పనులు కాబట్టి చేస్తున్నారు అని సమర్ధించుకోవడం.

__కోటి 50 లక్షల ప్యాకేజీ పనుల లో కడుతున్న ఈ పెద్ద కాలువ, సైడ్ కాలువ పనులు నిబంధనలకు నీళ్లు వదిలి కడుతున్న వైనం.

మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 19,( నిజం న్యూస్):

మహబూబాబాద్ పట్టణంలోని కొత్త బజారునం దు లక్ష్మీ టాకీస్ ఏరియా నుండి నాలుగు రోడ్ల కూడలి వద్ద కడుతున్న పెద్ద సైజు కాలువలను సంబంధిత కాంట్రాక్టర్ నిబంధనల ప్రకారం కాకుండా పెద్ద కాలువను తవ్విన తరువాత అందులో నుండి వెళ్లిన మట్టి రాళ్లను ఆ కాలువలో నీరు ఉండగానే వీటిని వేయడం వలన పది కాలాలపాటు ఉండవలసిన మోరి 10 నెలలలో కూలిపోయే ప్రమాదం ఉంది.

వాస్తవంగా సదరు కాంట్రాక్టర్ సైడ్ కాలువను తవ్విన తరువాత అందులో నీరు లేకుండా చూడాలి. తదుపరి 90 ఎం ఎం కంకర ను సిమెంట్ ఉసికెను కలిపి గ్రైండ్ చేసి 6 ఇంచుల బెడ్ గేయాలి. ఇవి ఏవి చేయకుండా తాను తీసిన కాలువలో ఉన్న మట్టిని రాళ్ళను వేశాడు. ఈ విషయాలను స్థానిక కమిషనర్ మున్సిపాలిటీ డి ఈ లకు ఫోటోల పూర్వకంగా తెలియ చేయడం జరిగింది.

దీనికి డి ఈ స్పందిస్తూ ఇవి పాత పనులు అందుకని వర్క్స్ చేస్తున్నారు. అని సమర్థించుకున్నారు. అదేంటి సార్! జిల్లా కలెక్టర్ ఆదేశాలు స్పష్టంగా ఉన్నాయి. కదా ఓటర్ని ప్రభావితం చేసే ఇలాంటి అభివృద్ధి పనులు చేయవద్దని ఉన్నాయని అడగగా సమాధానం దాట వేశారు.

కోటి 50 లక్షల ప్యాకేజీ లోని ఈ సైడ్ కాలువ పరిస్థితి ఇలా ఉంటే మిగతా పనుల పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎన్నికల నిబంధనను కచ్చితంగా అమలు పరచాలని ఎన్నికల కాలంలో ఓటర్లు ప్రభావిత పరిచే ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా చూడాలని ప్రస్తుతం నడుస్తున్న పనులను ఆపాలని ప్రజలు కోరుతున్నారు.

కోటి యాభై లక్షల ప్యాకేజీ పనులను పర్యవేక్షించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పనులపై విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను ప్రజలు కోరుతున్నారు.