Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కుంజ సత్యవతి.. ఆకస్మిక మృతి

బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కుంజ సత్యవతి.. ఆకస్మిక మృతి.. బిజెపి పార్టీకి తీరని లోటు

చర్ల అక్టోబర్ 16 (నిజం చెపుతాం) భద్రాచలం నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి గుంజ సత్యవతి ఆదివారం అర్ధరాత్రి ఆకస్మిక మృతి చెందారు అర్ధరాత్రి ఆమెకు బీపీ లెవెల్ పడిపోయి అస్వస్థకు గురి కావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు

ఆమె మృతి బిజెపి పార్టీకి తీరని లోటు ఏర్పడింది ఆమె పార్టీ బలోపేతానికి ఎంతో కృషి చేశారు ఆమె అంచె లంచలుగా ఎదుగుతూ ముందుగా సిపిఎం పార్టీ ఐద్వా డివిజన్ కార్యదర్శిగా ఓల్డ్ టైమర్ గా పని చేశారు

అనంతరం వైయస్ రాజశేఖర్ రెడ్డి అయాంలో కాంగ్రెస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి సిపిఎం అభ్యర్థి సున్నం రాజయ్య పై గెలుపొందారు పరిణామాల అనంతరం వైఎస్ఆర్.సిపి. పార్టీ నాయకురాలుగా కొంతకాలంకొనసాగారు.

అనంతరం బిజెపి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగాను. బిజెపి పార్టీ భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమితులయ్యారు

ఆమె మృతదేహానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే పొదెంవీరయ్య . బిఆర్ఎస్ పార్టీ భద్రాచలం నియోజకవర్గం అభ్యర్థి తెల్లం వెంకట్రావు వివిధ పార్టీల నాయకులు ఘన నివాళులు అర్పించి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు