Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

డిస్టిక్ మినరల్ ఫండ్ నుండి రూ 15 కోట్ల 79 లక్షల 47 వేలు మంజూరు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జడ్పీటీసీ పొశం నర్సింహారావు అధ్యక్షత శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జెడ్పీటీసీ పొశం మాట్లాడుతూ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రత్యేక కృషి తో కలెక్టర్ ఎం వి రెడ్డి సహకారం తో కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పినపాక నియోజకవర్గ
అభివృద్ధి కార్యక్రమాలకు డిస్టిక్ మినరల్ ఫండ్ నుండి రూ 15 కోట్ల 79 లక్షల నలభై ఏడు వేలు రూపాయలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.వివరాలు…1)నూతన డ్రైనేజీ నిర్మాణం నాయుడు గారి చెరువు వ్యయం 1కోటి 14 లక్షలు.
2)మున్సిపాలిటీలోని మెట్ల వాగు నుండి మామిడి తోట డ్రైనేజీ డెవలప్మెంట్ వ్యయం 26 లక్షల 35 వేలు.
3)కట్టు వాగు నుండి గాంధీ నగర్ టు చర్చి కాలనీ బండారుగూడెం డ్రైనేజి నిర్మాణం వ్యయం 39 లక్షల 67 వేలు.
4)విపుల సింగారం చెక్ డాం కాలువ వ్యయం 17 లక్షల 77 వేలు.
5)రేకుల గండి కాలువ, డెవలప్మెంట్ వ్యయం 4 కోట్ల 19 లక్షల 75 వేలు.
6)ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మెయిన్ గేటు మరియు సి సి రోడ్డు నిర్మాణం వ్యయం 13 లక్షల 50 వేల రూపాయలు.
7)కరకగూడెం నుండి చిరుమల్ల వంతెన పై రిటైనింగ్ వాల్ నిర్మాణం వ్యయం 58 వేలు
8)అశ్వాపురం మండలం గొందిగూడెం లస్కా వాగుపై లో లెవెల్ వంతెనను హైలెవల్ వంతెనగా నిర్మాణం వ్యయం 1 కోటి 20 లక్షల రూపాయలు.
9)మణుగూరు బస్ డిపో వద్ద 7 షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం వ్యయం 50 లక్షలు.
10)ప్రభుత్వ హైస్కూల్ బస్ డిపో నుండి గ్రంథాలయం వరకు 18 కాంప్లెక్సుల నిర్మాణం వ్యయం 1 కోటి 65 లక్షలు.
11)ఎంపీడీవో ఆఫీస్ నుండి ఎనిమిది షాపింగ్ కాంప్లెక్స్ రూముల నిర్మాణం వ్యయం 50 లక్షలు.
12)పినపాక మండలం చెగర్ష నుండి టీ కొత్తగూడెం రోడ్డు నిర్మాణం వ్యయం 4 కోట్ల 85 లక్షలు.
13)గుండాల ఆళ్లపల్లి రోడ్డు మరమ్మతుల వ్యయం 10 లక్షలు.
14)కరకగూడెం రోడ్డు మరమ్మతుల వ్యయం 10 లక్షలు కేటాయించినట్లు పొశం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారం విజయకుమారి,పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, ఎంపీటీసీల సంఘం అధ్యక్షులు గుడిపూడి కోటేశ్వరరావు,సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు ఏనిక ప్రసాద్, ఉప సర్పంచ్ పుచ్చకాయల శంకర్, ప్రభుదాస్,మణుగూరు మండల అధ్యక్షులు ముత్యం బాబు,టౌన్ అధ్యక్షులు అడపా అప్పారావు, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్,పార్టీ కార్యకర్తలు, యువజన నాయకులు, మీడియా మిత్రులు తదితరులు పాల్గొన్నారు.