Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

దిలవార్ పూర్ మండల ముఖ్య నేతలతో అల్లోల గౌతం రెడ్డి భేటీ

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో అక్టోబర్ 13 (నిజం చెప్పుతం)
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ముఖ్య మంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో నిర్మల్ నియోజకవర్గాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని బీఆర్ఎస్ యువజన నాయకులు అల్లోల గౌతం రెడ్డి అన్నారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గౌతంరెడ్డి ఆయా మండలాల వారీగా పార్టీ శ్రేణులతో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో దిలావర్ పూర్ మండల పరిధిలోని లోలం, కాల్వ గ్రామాల ముఖ్య నేతలతో కొండాపూర్ లోని బీఆర్ఎస్ కార్యాలయంలో భేటీ అయ్యారు.

సీఎం కేసీఆర్ అందిస్తున్న పథకాలు గడపగడపకు అందుతున్నాయని, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని కోరారు. నిర్మల్ నియోజవర్గంలో ఎక్కడా చూసిన అభివృద్ధి కనిపిస్తుందన్నారు. ఇంకా రానున్న రోజుల్లో మరింత ప్రగతి సాధిస్తున్నదని వెల్లడించారు.
మూడవసారి బీఆర్ఎస్ ఆదికారంలోకి రావడం ఖాయమని, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించనున్నారని పేర్కొన్నారు.

రానున్న అసెంబ్లీ ఎన్నిక ల్లో బారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సైనికుడిలా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. కష్టపడి పనిచేసిన ప్రతీ ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని, పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు..