Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అవినీతిని అంతం చేస్తా

-డాక్టర్ అంజి యాదవ్

:నియోజకవర్గంలో యువత పాత్ర ఎంతో అవసరం

:జరగబోయే సాధారణ ఎన్నికలలో అధికార పక్షానికి ప్రతిపక్షానికి యువత బుద్ధి చెప్పాలి

:అంజన్న యువ సమ్మేళనంలో పోటెత్తిన యువత.

కోదాడ,అక్టోబర్ 13: నిజం చెపుతాం న్యూస్

కోదాడ నియోజకవర్గంలో యువత పాత్ర ఎంతో అవసరం జరగబోయే సాధన ఎన్నికలలో అధికార పక్షానికి ప్రతిపక్షానికి యువత బుద్ధి చెప్పాలి నియోజకవర్గంలో అవినీతిని అంతం చేస్తా అని డాక్టర్ అంజి యాదవ్ అన్నారు

శుక్రవారం కోదాడ పట్టణంలోని పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో డాక్టర్ అంజన్న యువ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ అంజి యాదవ్ పాల్గొని యువత సమస్యలను తెలుసుకొని మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపుగా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు 16 వేల వరకు ఉన్నారని వారిని ప్రభుత్వం నోటిఫికేషన్ల రూపంలో మోసం చేస్తుందని,యువతకు ఉపాధి కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని,నియోజకవర్గంలో అవినీతి రాజ్యం ఏలుతుందని అన్నారు.

రాబోయే ఎన్నికలలో అధికార,ప్రతిపక్ష పార్టీలను ఓడించడానికి యువకులు సిద్ధంగా ఉండాలని అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార,ప్రతిపక్ష పార్టీలను నిలదీయడానికి యువకులు సిద్ధంగా ఉన్నారని,కోదాడ రాజకీయ వ్యవస్థలో నూతన మార్పుకు యువత శ్రీకారం చుట్టాలని,అవినీతిని అంతమొతించడంలో యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు.

అనంతరం పలువురు యువకులు మాట్లాడుతూ వారి సమస్యల గూర్చి ప్రస్తావిస్తూ కోదాడ అభివృద్ధి అనేది యువకుడు,విద్యావంతుడు,తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు డాక్టర్ అంజి యాదవ్ ద్వారానే సాధ్యమని మా యొక్క మద్దతు పూర్తిస్థాయిలో అంజి యాదవ్ కే ఉంటుందని,యువకులు అంజన్నని గెలిపించడంలో ప్రతి ఒక్కరు సైనికులా పనిచేస్తామని,రాజకీయాలలో ధన ప్రభావానికి అడ్డుకట్ట వేసి నీతివంతమైన రాజకీయ వ్యవస్థకు తెర తీస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాజశేఖర్ నాయుడు దేశినేని,గంధం సైదులు,బానోవత్ టాకూర్,చింతకుంట్ల సతీష్,నలమాద హరీష్,లక్ష్మణ్ యాదవ్,సురేందర్ చారి,కతిమాల వెంకన్న,తోకల మహేష్,మొక్క రమేష్,నియోజకవర్గంలో యువకులు,నిరుద్యోగులు తదితరులు పాల్గొన్నారు.