తెలంగాణ విప్ రేగా కాంతారావు కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలని వేదాంతపురం ఆలయంలో ప్రత్యేక
ప్రభుత్వ విఫ్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కరోనా మహమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని ప్రజలకు ఎప్పటి లాగే నిరంతరం సేవలు అందంచాలి అని వేదాంతపురం లో వున్నా వన దేవతలు మరియు ముత్యాలమ్మ దేవతకు అశ్వారావుపేట మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు, జిల్లా దిశ కమిటీ సభ్యులు నారం రాజశేఖర్ ప్రత్యేక పూజలు చేయించి, కరోనా మహమ్మారి నుండి త్వరగా కోలుకోవాలని దేవుని చుట్టూ ప్రదర్శనం చెయ్యడం, కొబ్బరి కాయలు కొట్టడం, పూజలు చేయించడం జరిగింది. ఈ కార్యక్రమం లో పలువురు యువత పాల్గొన్నారు.