తల్లాడ భాస్కర్ ను శాస్త్రవేత్తగా గుర్తించిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ
తుంగతుర్తి అక్టోబర్ 10 నిజం చెబుతాం న్యూస్
ప్రపంచ ప్రఖ్యాతి గాంచినస్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకాలిఫోర్నియా వారు
తల్లాడ భాస్కర్ గుప్త ప్రముఖ శాస్త్రవేత్తగా ప్రకటించారు.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పు గూడెం గ్రామానికి చెందిన తల్లాడ భాస్కర్ చిన్నతనం నుండి కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాడు .
కెమిస్ట్రీ రంగంలో ఎంఎస్సీ పిహెచ్డి పూర్తి చేసి ప్రస్తుతం కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.
తాను చదివిన తుంగతుర్తి పాఠశాలలో టెన్ జి పి ఎ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఒక్కొక్కరికి వెయ్యినూట పదహార్లు అందజేసి వారి గొప్ప మనసు చాటుకున్నారు
తనతో పాటు తాను చదివిన పాఠశాల విద్యార్థులు కూడా తనలా మరియు తన కన్నా గొప్పగా ఎదగాలని కోరుకున్న సహృదయుడు తల్లాడ భాస్కర్ కు ఉపాధ్యాయ బృందం బంధువులు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలియపరిచారు.
ఏది ఏమైనా పవిత్రమైన వృత్తిలో ఉంటూ కూడా తాను చదివిన పాఠశాలను గుర్తించి, విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించడం అభినందనీయమని పలువురు అన్నారు