Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్

జిల్లా పరిషత్ చైర్పర్సన్ గుజ్జాదీపిక యుగంధర్ రావు, ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్.

తుంగతుర్తి అక్టోబర్ 9 నిజం చెపుతాం న్యూస్

దేశంలోని ప్రజలందరికీ ఓటు హక్కును కల్పించి, ఆర్టికల్ 3 తో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి, రిజర్వేషన్ తో రాజకీయ నాయకులు పదవులు కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేనని సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జా దీపిక యుగంధర్ రావు స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్లు అన్నారు.

సోమవారం మండల పరిధిలోని తూర్పు గూడెం గ్రామంలో సాధన అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించి ,అనంతరం 25 లక్షల వ్యయంతో కూడిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం నిర్వహించి మాట్లాడారు.

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిన్నతనం ఉండే కష్టపడి చదివి, రాజ్యాంగాన్ని తయారుచేసి భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయుడు అని కొనియాడారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఉన్నతమైన చదువులు చదివి ప్రత్యేకంగా పాఠశాలలు కళాశాలలు ఏర్పాటు చేసి, డిగ్రీ కళాశాల కోసం అప్పిలేషన్ కోసం నాటి నవాబు రాజు గుర్తించి ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా ఆపిలేషన్ ఇచ్చి, డాక్టర్ రేటు పట్టా బిరుదును సంపాదించాడు.

బిఆర్ అంబేద్కర్ రచించిన లికితపూర్వ రాజ్యాంగంతోనే నేడు చిన్న రాష్ట్రాల ఏర్పాటు హక్కులు ఆర్టికల్స్ రిజర్వేషన్లు ప్రజలు పొందుతున్నారని తెలిపారు.

మంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను మిషన్ కాకతీయ మిషన్ భగీరథ రైతుబంధు రుణమాఫీ రైతు బీమా కేసీఆర్ కిట్టు దళిత బంధు గృహలక్ష్మి వంటి పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.

ఒక తూర్పు గూడెం గ్రామానికి ఒక కోటి యాభై లక్షల నిధులతో అభివృద్ధి పనులు సాగినట్లు తెలిపారు.

నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ తుంగతుర్తి నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించినప్పుడే సాధ్యమని వారు అన్నారు . ప్రతిపక్షాలకుంటలకు ఎవరు మోసపోవద్దని కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీపీ గుండ గాని కవితా రాములు గౌడ్ బీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్ మండల పార్టీ అధ్యక్షులు తాడికొండ సీతయ్య స్థానిక సర్పంచ్ పూలమ్మ, గ్రామ శాఖ అధ్యక్షులు యాదగిరి, మల్లయ్య, వెంకన్న ,రామ్మూర్తి సైదులు తోట్ల శ్రీనివాస్ గౌడ్, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు…