Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గురుకులంలో క్రీడోత్సవాలకు 50 వేలు ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే.

తుంగతుర్తి అక్టోబర్ 7 నిజం చెపుతాం న్యూస్

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ కళాశాల) లో ఈనెల 13 తేదీ నుండి16 తేదీ వరకు నిర్వహించే గురుకుల పాఠశాలల జోనల్ స్పోర్ట్స్ మీట్ క్రీడోత్సవాలకు 50 వేల రూపాయల ఆర్థిక సహాయం పంపించిన తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ .

అట్టి 50 వేల రూపాయలను ప్రిన్సిపల్ శ్యామలత కు శనివారం అందించిన ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు , మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య జిల్లా నాయకులు గుండ గాని రాములు గౌడ్ .

50వేల రూపాయలు ఆర్థిక సహాయం పంపించిన ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పాఠశాల/ కళాశాల తరఫున ప్రిన్సిపాల్ శ్యామలత హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

గురుకుల క్రీడోత్సవాల విజయవంతంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు…