Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

కానిస్టేబుల్ ఫలితాల్లో ఎస్పీఎఫ్ ఎంపికైన మల్లెపాక అఖిల్

ఎస్సీ కాలనీలో మెరిసిన దళిత ఆణిముత్యం…. అఖిల్.

తుంగతుర్తి అక్టోబర్ 6 నిజం చెపుతాం న్యూస్

తుంగతుర్తి మండల కేంద్రంలో ఎస్సీ కాలనీ కి చెందిన పేద దళితులైన మల్లెపాక రాములు, పూలమ్మ కుమారుడు మల్లెపాక అఖిల్ చిన్నతనం నుండి కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి సమాజానికి సేవ చేయాలని దృఢ సంకల్పంతో… పదవ తరగతి ప్రభుత్వ పాఠశాలలోనూ ఇంటర్ మోడల్ స్కూల్లో కష్టపడి విద్యాభ్యాసం పూర్తి చేశాడు.

తెలంగాణ రాష్ట్రంలో యువతకు ఉన్నతమైన ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యముతో ప్రభుత్వం, పోలీసు ఉద్యోగాలను భర్తీ చేశారు. దీనితో 2023 కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొని, కష్టపడి రాత్రింబవళ్లు చదివి, పరీక్షలు రాశాడు.

కానిస్టేబుల్ ఫలితాల్లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గా ఎంపిక అయ్యాడు. మల్లెపాక రాములు తాపీ మేస్త్రి పని చేస్తూ, పూలమ్మ పశువుల కాపరి గా జీవనం సాగిస్తున్నారు.

అయినప్పటికీ అఖిల్ ఒక ప్రక్క పరీక్ష రాసి, కాలాన్ని వృధా చేయకుండా, మరొక ప్రక్క పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ కానిస్టేబుల్ గ ఎంపికవ్వడం నాకు చాలా సంతోషంగా ఉందని నిజం న్యూస్ తో అఖిల్ ముచ్చటించారు.

ఏది ఏమైనా తల్లిదండ్రులు కష్టపడి కూలి పని చేస్తూ చదివించినందుకు, మంచి మార్కులు సాధించి, ఉన్నతమైన పోలీసు ఉద్యోగం పొందడం పట్ల కాలనీకి చెందిన ఏవైసీ సభ్యులు, అఖిల్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు,

పోలీస్ కానిస్టేబుల్, ఉద్యోగం రావడం పట్ల బంధువులు మేధావులు స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు…