అద్భుత దేవాలయం కింద…. మరో అత్యద్భుత దేవాలయం….
ఈ ప్రపంచంలో అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఇంకా చాలా రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి.
అలాంటి మిస్టరీలో ఒకటి మన ఇండియాలోనే ఉంది. ఈ మిస్టరీపై ఔరంగజేబు కన్ను పడింది.
ఔరంగజేబు కన్ను పడ్డ ఆలయాలన్నీ ధ్వంసం అయ్యాయి..
అన్నీ ఆలయాలను ద్వంసం చేసినట్లే ఈ ఆలయాన్ని కూడా నాశనం చేద్దామని భావించాడు.. వందల సంఖ్యలో పని వాళ్లను పంపాడు
మూడేళ్లు కష్టపడ్డా ఒక ఇటుకను కూడా కదిలించలేకపోయారు..
అలాంటి అద్భుతమైన దేవాలయం ఎక్కడున్నదో తెలుసా..!
ఇది మహారాష్ట్రలోని ఔరంగబాద్‌కు 50 కిలోమీటర్ల దూరంలో గల, 32 ఎల్లోరా గుహల్లోని 16వ కేవ్ లో ఈ ఆలయం ఉంది.
ఒక రాతి కొండను పైనుంచి కిందికి తొలుస్తూ ఈ ఆలయాన్ని నిర్మించారు.
శిల్పులంతా కలిసి 100 అడుగుల ఎత్తైన కొండను ఆలయంగా చెక్కారంటే నిజంగా అద్భుతమే.
టెక్నాలజీ అందుబాటులోలేని ఆ రోజుల్లో ఇంత అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారంటే.. అస్సలు నమ్మబుద్ధి కాదు.
పురావస్తు పరిశోధకుల అంచనాల ప్రకారం 4 లక్షల టన్నుల రాయిని 18 ఏళ్లపాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని తెలుస్తోంది.
శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీ.శ.783లో పూర్తిచేసినట్లు ఉంది. ఇందులోని విగ్రహాలను పరిశీలించగా.. దాదాపు 600వ సంవత్సరంలో నిర్మాణం ప్రారంభించినట్లు తెలుస్తోంది.
అంటే.. దీని నిర్మాణానికి 150 ఏళ్లు పట్టినట్లు సమాచారం.
ఆలయ గోడలపై రామాయణం, భాగవతం, మహాభారత గాథలను శిల్పాలుగా మలిచారు.
ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు. ఎందుకు నిర్మించారనేది ఇప్పటికీ రహస్యమే.
ఈ ఆలయం కింద 2 అడుగుల మనిషి మాత్రమే దూరేంత గుహ ఉంది.
ఈ కైలాస టెంపుల్ మరో ప్రత్యేకత ఏమిటంటే ఆకాశం నుంచి చూస్తే.. ఎక్స్ ఆకారం లో ఉంటుంది.
భూమి మీద నుంచి చూస్తే.. 4 సింహాలు ఎక్స్ (X) ఆకారంలో నిలుచున్నట్లు కనిపిస్తుంది.
ఈ ఆలయం అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైనది. ఆలయ నిర్మాణంలోనే వాటర్ హార్వెస్టింగ్ సౌకర్యం ఉన్నది..
డ్రైనేజ్ వ్యవస్థ, రహస్య మార్గాలు, బాల్కనీలు, అప్ స్టైర్స్ వంటి ఎన్నో అద్భుతాలను కొండను మలిచి చెక్కారు.
అంతు చిక్కని మిస్టరీగా నిలిచిన కైలాశ ఆలయం ప్రత్యేకతలు తెలుసుకుందాం.
అద్భుతం ‘కింద’.. మరో అద్భుతం….
ఇప్పటివరకు అంతా ఈ ఆలయ నిర్మాణమే పెద్ద మిస్టరీగా భావించారు. కానీ, దీని ‘కింద’ మరో మిస్టరీ దాగి ఉంది. అదే ‘అండర్ గ్రౌండ్’ సిటీ.
దీని నిర్మాణాన్ని పరిశీలిస్తే.. దీన్ని నిర్మించడం మనుషుల వల్ల కాదని తెలుస్తోంది.
ఆలయంలోని చెక్కిన రెండు అడుగుల సొరంగంలోకి మనిషి వెళ్లడం అసాధ్యం అనిపిస్తుంది.
అలాగే, ఆలయం దిగువన గుండ్రని రంథ్రాలు సైతం ఎంతో లోతుగా ఉన్నాయి.
ఇవన్నీ పరిశీలిస్తే.. ఈ ఆలయం కింద ఓ అండర్ గ్రౌండ్ సిటీ ఉందని తెలుస్తోంది.
ఈ చిన్న రంధ్రాల నుంచి కిందికి వెళ్లాలంటే అతి చిన్న మనుషులు లేదా పిల్లల వల్లే సాధ్యం.
ఈ నేపథ్యంలో వేల ఏళ్ల కిందట ఏలియన్స్ ఇక్కడ సంచరించాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఆ ఆలయం మీద ఉన్న కొన్ని శిల్పాల్లో చిన్న చిన్న ఆకారాల్లో ఉన్న రూపాలను చూస్తే అది నిజమే అనిపిస్తుంది.
గుహాలో ఏలియన్స్ ఉన్నారా..?
బ్రిటన్‌కు చెందిన ఓ రచయిత్రికి మందిరాలు, నిర్మాణాలపై పుస్తకాలు రాయడం ఆసక్తి.
ఆమె కైలాస ఆలయం గురించి కూడా 1926 రాశారు.
ఆలయాన్ని అణువణువూ తాను పరిశీలించానని పేర్కొన్నారు.
తాను ఆలయంలోకి 100 మీటర్ల దూరం వెళ్లగానే బయటికి కనిపించే గుడికంటే అద్భుతమైన మరో గుడి లోపల ఉన్నట్లు తెలిపారు.
గుహలో నివసించే ఏడుగురిని తాను చూసినట్లు పేర్కొన్నారు.
వారి కళ్లు కూడా ప్రకాశవంతంగా ఉన్నట్లు, కొంతమంది అప్పుడప్పుడు మాయమవుతున్నట్లు వివరించింది.
గుహలో ఒక ప్రకాశవంతమైన వస్తువును కూడా గమనించినట్లు రచయిత్రి తెలిపింది.
దాని కాంతి నలువైపులా ప్రసరించడాన్ని గమనించానని పేర్కొంది.
1876, డిసెంబర్ 8లో 12 మంది పరిశోధకులతో కూడిన బృందం వస్తువు విశేషం తేల్చడానికి కైలాస గుడి ఉన్న గుహలోకి ప్రవేశించింది.
వీరు 120 మీటర్లు లోపలికి వెళ్లగానే అక్కడ వాళ్లకి ఒక భయంకరమైన రూపం కనిపించింది. దానిని చూసి నిశ్చేష్టులయ్యారు.
12 మంది క్షేమంగా బయటకు వచ్చారు. గతంలో లోనికి వెళ్లినవారెవనూ బయటకు రాలేదని తెలుస్తోంది
వారు ఆలయం గురించి, గుహలో గమనించిన దృశ్యాల గురించి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు.
భారత ప్రభుత్వం ఆ తర్వాత ఆ గుహను మూసివేసింది.
భర్తను కాపాడుకోవడానికి రాణి నిర్మించినట్లు సమాచారం….
వందల ఏళ్ల క్రితం కైలాస ఆలయాన్ని ఒక రాణి నిర్మించినట్లు తెలుస్తోంది.
అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన తన భర్తను కాపాడుకోవడానికి శివుడిని పూజించడంతో పాటు తన భర్త త్వరగా కోలుకుంటే ఆలయం నిర్మిస్తానని మొక్కుకుంది.
ఆలయం నిర్మాణం శిఖరం చూసే వరకు ఉపవాసం కూడా చేస్తానని మొక్కుకుంది. అనుకున్నట్లుగానే రాజు త్వరగా కోలుకున్నాడు.
దీంతో రాణి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ఆలయ నిర్మాణం పూర్తి చేయడానికి ఏళ్లు పడుతుందని
అప్పటి వరకు తన భార్య ఉపవాసం చేయడం కష్టమని రాజు గ్రహించాడు.
ఈ క్రమంలో రాజు శివున్ని పూజించి ప్రసన్నం చేసుకున్నాడు.
శివుడు ప్రత్యక్షమై శివునికి ఆలయం శిఖర నిర్మాణం పూర్తయ్యే వరకు తన భార్య ఉపవాసం చేయడం సాధ్యం కాదని, ఉపాయం చెప్పాలని వేడుకున్నాడట.
ఈ సమయంలో శివుడు ఆలయ నిర్మాణం త్వరగా చేయడానికి ఒక అస్త్రాన్ని రాజుకు ఇచ్చాడట.
అంతేకాకుండా నిర్మాణాన్ని పునాది నుంచి కాకుండా శిఖరం నుంచి ప్రారంభించాలని చెప్పాడట.
అలా అయితే రాణి మొదట శిఖరం చూసి ఉపవాస దీక్ష విరమిస్తుందని తెలిపాడట.
శివుడు చెప్పినట్లే రాజు అస్త్రం సాయంతో ఆలయాన్ని శిఖరం నుంచి నిర్మించడం మొదలు పెట్టాడట. దీంతో రాణి ఉపవాస దీక్ష విరమించిందట.
ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత రాజు శివుడు ఇచ్చిన విలువైన అస్త్రాన్ని ఆలయం కింద గుహలో దాచినట్లు తెలుస్తోంది.
బ్రిటన్ రచయిత చూసిన వస్తువు అదే అయి ఉంటుందని భావిస్తున్నారు. 12 మంది బృందం కూడా దీనినే చూసి ఉంటుందని సమాచారం.
అయితే దీనిని చూసినవారెవరూ ఎక్కువ కాలం బతకలేదట. రేడియో యాక్టివ్ కిరణాల కారణంగానే చనిపోయి ఉంటారని సమాచారం.
రచయిత్రికి కనబడిన ప్రకాశవంతమైన వ్యక్తులు కూడా ఆ అస్త్రానికి రక్షణగా ఉండి ఉంటారని భావిస్తున్నారు.
ఆ నీళ్లు ఎక్కడికి పోతాయి?….
ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో తెలియదు. అవి ఆ కింద ఉన్న అండర్ గ్రౌండ్ సిటీలోకి వెళ్తాయనే సందేహాలు ఉన్నాయి.
ఆలయం నేలకు ఉన్న రంథ్రాలు గాలి, వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చని పలువురు చెబుతుంటారు.
ఆ రంథ్రాల్లో చిన్నారులు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని మూసి వేసింది.
మనుషులు వెళ్లడానికి వీలులేని ఆ గుహల్లోకి డ్రోన్లను పంపినట్లయితే.. మరిన్ని విషయాలను తెలుసుకోవచ్చు.
అయితే, ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా లేదు. గత 40 ఏళ్ల నుంచి ఆ సొరంగాలు మూసే ఉన్నాయి.
దీంతో ఆ గుహల్లో విలువైన నిధులు ఉండవచ్చనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.