Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గౌడ కులస్తుల అభ్యున్నతి ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యం

రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

తుంగతుర్తి సెప్టెంబర్ 5 నిజం చెపుతాం న్యూస్

తెలంగాణ రాష్ట్రంలో గౌడ కులస్తుల అభ్యున్నతికి కృషి చేస్తున్నది ముఖ్యమంత్రి కేసీఆర్ నేనని రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్లు అన్నారు

గురువారం మండల కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. గౌడ కులంలో పుట్టి గీతా పని చేసే వారికి 45 సంవత్సరాలకే పింఛన్ ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు.

గౌడ కులస్తుల ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించారు. ప్రతి మండలంలో గౌడ కులస్తులకు ప్రత్యేకంగా కోటి రూపాయలతో గౌడ సంఘ భవనాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

నియోజకవర్గంలోని ప్రతి గీత కార్మికునికి పనిముట్ల కోసం పదివేల రూపాయలు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. గౌడ సంఘ భవన నిర్మాణం కోసం అదనంగా 10 లక్షల రూపాయలు రాజ్యసభ సభ్యులు బడుగుల లింగ యాదవ్ ని ఎమ్మెల్యే కోరగా తక్షణమే ఆమోదం తెలిపారు.

మొదటి చక్రవర్తుల మీద పోరాట వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గా చెప్పుకోవచ్చు.376 సంవత్సరాల చరిత్ర కలిగిన, పోరాట ప్రతిమ ఉన్న నాయకునిగా సర్దార్ సర్వాయి పాపన్న అని అన్నారు.

అనంతరం గౌడ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న చరిత్ర పెద్దదని, కావాలని కొంతమంది అనగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు. బహుజనుల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.

తెలంగాణలో గీతా కార్మికుల సమస్యలను ఎల్లవేళలా పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. గౌడ సంఘం అభ్యున్నతి ముఖ్యమంత్రి కేసీఆర్ తో సాధ్యమని రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ సీఎంగా రావడానికి, తుంగతుర్తిలో ఎమ్మెల్యేగా డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రావడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ సెక్రెటరీ కోతి. కిషోర్ గౌడ్, సూర్యాపేట జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ దీపిక యుగంధర్ రావు, వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్ , రాష్ట్ర బీసీ వెల్ఫేర్ అధ్యక్షుడు భూరా వెంకటేశం గౌడ్, మాజీ మార్కెట్ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్,

గౌడ సంఘ జిల్లా నాయకులు పులుసు వెంకన్న గౌడ్ వెంకట నారాయణ గౌడ్ సాయిల్ గౌడ్ మండల గౌడ సంఘ నాయకులు గుండ గాని రాములు గౌడ్, గుండ గాని దుర్గయ్య గుండె గాని శ్రీను గ్రంధాలయ చైర్మన్ గోపగాని రమేష్ గౌడ్ గోపగాని శ్రీను అంజయ్య, సర్పంచ్ అబ్బగాని పద్మ సత్యనారాయణ గౌడ్, యాదగిరి గౌడ్, తునికి లక్ష్మి తదితర, నాయకులు పాల్గొన్నారు…