Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగండి..

నేరాలకు పాల్పడితే జైలు జీవితం తప్పదు.. ఏ ఎస్ పి పరితోష్ పంకజ్
చర్ల అక్టోబర్4 (నిజంచెపుతాం)

రౌడీషీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని,ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని నేరాలకు పాల్పడితే జైలు జీవితం తప్పదని భద్రాచలం ఏఎస్పి పరితోష్ పంకజ్ హెచ్చరించారు.

బుధవారం చర్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో మండలంలోని రౌడీషీటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.సమాజంలో గౌరవప్రదంగా మెలగాలని తద్వారా మంచి వారిగా ముందుకు సాగాలని ఆయన సూచించారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే తీవ్రమైన చర్యలు అనుభవించాల్సి ఉంటుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఇకనుండి ఎటువంటి నేరాలకు పాల్పడకుండా ఉండి సమాజంలో సముచిత స్థానంలో నిలిచేలా గౌరవప్రదంగా మెలగాలని ఆయన హితవు పలికారు.

ఎటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడినా చట్టపరంగా జైలు జీవితం తప్పదని ఆయన హెచ్చరించారు.

ఈ సమావేశంలో సీఐ బి.రాజగోపాల్ ఎస్సైలు,టీవిఆర్ సూరి,వెంకటప్పయ్య ,నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.