సీఎం కేసీఆర్ చెప్పిన పారాసెట్మాల్ కరోనా కి విరుగుడు

*కరోనా పట్ల నిర్లక్ష్యం వద్దు
*పారాసెట్మాల్ ,బలవర్థక ఆహారం తప్పనిసరి
*విటమిన్ డి కొరకు ఎండలో ఉదయాన్నే వ్యాయామం
* కాచి చల్లార్చిన నీళ్లు తాగుతున్నాను
*మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి
* ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు వారు సూచించినప్రభుత్వ మందులు వాడుతున్నాను
*మాస్కు తప్పని సరి
ఫోన్ లో వివరాలు వెల్లడించిన రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన ఈ విధంగా పారాసెట్మాల్ టాబ్లెట్ కరోనా కు విరుగుడు అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రాపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు .ఆయన కరోన భారిన పడిన నేపథ్యంలో మన్యం టీవి తో ఫోన్లో మాట్లాడారు. కరోనా పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అని సూచించారు. కరోన లక్షణాలు వివరిస్తూ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ పర్యటన రోజున సాయంత్రం ఐదు గంటలకి విపరీతమైన కాళ్ల ,ఒంటి నొప్పులు ప్రారంభమైనట్లు, అనంతరం చేతి వేళ్లను ముల్లుతో గుచ్చినట్లు విపరీతమైన నొప్పులు రావడం జరిగిందన్నారు. కొత్తగూడెం పర్యటన ముగించుకుని అనుమానంతో వెంటనే ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ ని సంప్రదించి పరీక్ష చేయించగా 101 టెంపరేచర్ ఉన్నట్లు తెలిపారు.వెంటనే వైద్యుల సూచన మేరకు పారాసెట్మాల్ టాబ్లెట్, ఆంటీబయాటిక్ టాబ్లెట్స్ వేసికునట్లు తెలిపారు .అలాగే బలవర్ధక ఆహారం తీసుకోవడం లో భాగంగా డ్రాగన్ ఫ్రూట్ లు,కివీ,బొప్పాయి సంత్రాలు, ఖర్జూర ,ఎండు ద్రాక్ష, తీసుకోవడం జరుగుతుందన్నారు. తొమ్మిది రోజుల పాటు ప్రభుత్వ వైద్యుల సూచనలు పాటిస్తానని వారిచ్చిన మందులను వాడి కరోనాను జయిస్తానని విప్ రేగా కాంతారావు అన్నారు.ప్రతి ఒక్కరు మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కరోన పట్ల అశ్రద్ధ వీడాలని వేగంగా రావు సూచించారు.