కాంగ్రెస్, బిజెపి మాయమాటలను ప్రజలు నమ్మరు
ఎమ్మెల్యే కిషోర్ చేతుల మీదుగా క్యాంపు వసతి కార్యాలయం ప్రారంభం
తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్
తుంగతుర్తి అక్టోబర్ 4 నిజం చెపుతాం న్యూస్
తెలంగాణలో కాంగ్రెస్ బిజెపి మాయమాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని సంక్షేమ పథకాల ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం ఖాయమని తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు.
బుధవారం మండల కేంద్రంలోని వెంపటి రోడ్డులో ఒక కోటి పది లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టిన నూతన క్యాంపు, వసతి గృహాన్ని ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కమల దంపతుల ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.
తుంగతుర్తి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో ఒక లక్ష ఇరవై వేల ఎకరాలు కాలేశ్వరం జనాల ద్వారా సాగునీరు, 24 గంటలు ఉచిత విద్యుత్తు, 13 వేల మంది కళ్యాణ లక్ష్మి, 50, వేల మందికి ఆసరా పింఛన్లు, దళిత బంధు, రైతు బీమా, కెసిఆర్ కిట్టు, రుణమాఫీ వంటి పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.
నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉండే సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశలో ప్రతి నియోజకవర్గ కేంద్రానికి ఒక ఎమ్మెల్యే క్యాంపు వసతి గృహాన్ని ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అన్నారు.
నియోజకవర్గంలో తలపెట్టిన ఆశీర్వాద సభ, అభివృద్ధి సభలు అనుకున్న దానికంటే రెట్టింపు దశలో ప్రజలంతా ఆశీర్వదించినట్టు తెలిపారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి ఎన్ని కుట్రలు కుతంత్రాలు పండిన తుంగతుర్తి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని అన్నారు. నాయకులు కార్యకర్తలు ఐకమత్యంతో గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఎమ్మెల్యేను పలువురు నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు
ఈ కార్యక్రమంలో సూర్యాపేట జెడ్పి చైర్ పర్సన్ గుజ్జా దీపిక యుగంధర్ రావు, జిల్లా రైతు బంధు కోఆర్డినేటర్ ఎస్సీ రజాక్, ఆయిల్ ఫ్రడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి ,డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు, తిరుమలగిరి మార్కెట్ చైర్ పర్సన్ స్రవంతి, మున్సిపల్ చైర్ పర్సన్ రజిని,
మార్కెట్ చైర్మన్ సురేందర్ నాయక్, మాజీ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్, ఎంపీపీ గుండ గాని కవితా రాములు గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య, మండల రైతు సమితి కన్వీనర్ దొంగల శ్రీను, జడ్పిటిసి దావుల వీరప్రసాద్ యాదవ్ దామోదర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు…