Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నేడు ప్రారంభం కానున్న ఎమ్మెల్యే వసతి, క్యాంపు కార్యాలయం

ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం

తుంగతుర్తి అక్టోబర్ 3 నిజం చెపుతాం న్యూస్

గడిచిన 40 సంవత్సరాలుగా ఎంతో మంది ఎమ్మెల్యేలు పదవులు చేపట్టినప్పటికీ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యేకు ప్రత్యేకమైన వసతి గృహం, క్యాంపు కార్యాలయం లేదు. ఇటువంటి ప్రయత్నాలు కూడా జరగలేదని చెప్పవచ్చు .

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం తుంగతుర్తి నియోజకవర్గం యువ నాయకుడు ఉద్యమానికి ఉద్యమ నాయకుడుగా ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడంతో డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి మొదటిసారిగా గెలుపొందారు.

దీనితో నియోజకవర్గ కేంద్రంలో ప్రజల సమస్యలను తీర్చుటకు ప్రత్యేకంగా ఒక క్యాంపు కార్యాలయం ఉండాలని లక్ష్యంతో కోటి రూపాయల నిధులతో 2018 జూలైలో మొదటిసారిగా శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు.

మొదటిలో నిర్మాణ పనులు పనులు వేగవంతంగా జరిగినప్పటికీ, గడిచిన రెండు సంవత్సరాల కాలంలో కరోనా కష్ట కాలంలో పనులు మందగించి, నేడు పూర్తిస్థాయిలో బిల్డింగ్ నిర్మాణ పనులు పూర్తయ్యాయి.

అదనంగా చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణ పనుల కోసం తిరిగి మళ్లీ ప్రత్యేక 10 లక్షల నిధులను మంజూరు చేయడం జరిగింది. ఏది ఏమైనా ముందస్తుగానే ఎమ్మెల్యే అక్టోబర్లో ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి, అక్టోబర్ 4 న బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమం కలదు.

ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ సూర్యాపేట జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ దీపిక యుగంధర్ రావు, స్థానిక ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నట్లు స్థానిక నాయకులు తెలిపారు,

క్యాంపు కార్యాలయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం పట్ల, దీనితో నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎమ్మెల్యే వసతి, క్యాంపు కార్యాలయం అందుబాటులోకి రావడం సంతోషంగా ఉంది.

ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్

గతంలో ఏ ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా వసతి ,క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయలేదు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాల దుష్ట, ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కోటి రూపాయల నిధులు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉన్నది .

దీనితో నిర్మాణ పనులు వేగంగా ఏర్పాటు చేసి నేడు క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకోవడం మనందరి అదృష్టమని అన్నారు. నిధులు సహకారం అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.