మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి తండ్రి కాబోతున్నాడు..
విరాట్ కోహ్లీ ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు.. ఒ క్రికేటర్ గా భారతదేశం టీంకి ముందుండి ఎన్నో విజయాలు, బహుమతులు, పతాకాలు, తనపై భారీ వెసుకుని భారతదేశాని గెలిపించిన వారిలలో విరాట్ కోహ్లీ ఒకరు..
మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి తండ్రి కాబోతున్నాడు. అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్కశర్మ రెండోసారి గర్భం దాల్చినట్లు ప్రచారం జరుగుతోంది. తమ రెండో బిడ్డకు సంబంధించి కోహ్లి- అనుష్క శర్మ త్వరలోనే అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు తెలస్తుంది. ఇటీవలే అనుష్క శర్మ.. కోహ్లితో కలిసి ముంబైలోని ఓ గైనకాలజీ క్లినిక్కు వచ్చినట్లు ఓ వార్త హల్చెల్ అవుతుంది.
తవరలోనే అధికారిక ప్రకటన చేస్తామని వారు తెలిపారు. ప్రెగ్నెన్సీ కారణంగానే అనుష్క శర్మ.. కోహ్లితో కలిసి క్రికెట్ పర్యటనలకు వెళ్లడం లేదని, మీడియాకు కూడా దూరంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అయితే అనుష్క శర్మ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో అనేక సార్లు ఈ రూమర్లు రాగా.. అవన్నీ గాలివార్తలేనని తర్వాత స్పష్టమైంది.
ఈ ఏడాది ఆగస్ట్లో కూడా ఇలాంటి వార్తలే రాగా.. విరాట్ కోహ్లితో కలిసి అనుష్క శర్మ ఓ యాడ్ ఫొటో షూట్లో పాల్గొంది. దాంతో అవన్నీ గాలి వార్తలేనని స్పష్టమైంది. ఇక కోహ్లి- అనుష్క దంపతులకు 2021లో ఓ పాప జన్మించింది. ఆమెకు వామికా అని పేరు పెట్టారు.
అనుష్క సిని మాలకు దూరంగా ఉంటూ కూతురుతో గడుపుతోంది