Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ధరణి పోర్టల్ ప్రారంభించిన మెచ్చా*

భూములు క్రయ విక్రయాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ ను స్థానిక శాసనసభ్యులు నాగేశ్వర రావు గురువారం ప్రారంభించడం జరిగింది. అశ్వారావుపేట రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధరణి పోర్టల్ ను మెచ్చా నాగేశ్వరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మెచ్చా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తున్న ఈ సౌకర్యాన్ని ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా ధరణి పోర్టల్ నిర్వహణ పారదర్శకంగా ఉండే విధంగా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ చల్లా ప్రసాద్, జడ్పీటీసీ చిన్నం శెట్టి వరలక్ష్మి, మండల నాయకులు మందపాటి రాజమోహన్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.