Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జర్నలిస్టుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తాం

– టీజేయూ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాదరావు

జర్నలిస్ట్ లకి ప్రత్యేక రక్షణ చట్టం రూపొందించి అమలు చేయాలి

జర్నలిస్టులకు రావలసిన న్యాయమైన డిమాండ్లలో అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

జర్నలిస్ట్ లకి హెల్త్ కార్డులు కార్పొరేట్ ఆసుపత్రిలో చెల్లుబాటు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్ బ్యూరో ,సెప్టెంబర్ 30 నిజం చెపుతం : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎండి షానూర్ బాబా ఆధ్వర్యంలో నిర్వహించిన యాదాద్రి భువనగిరి జిల్లా ద్వితీయ మహాసభలోతెలంగాణ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షులు కప్పర ప్రసాద్ రావు పాల్గొని అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించింది జర్నలిస్టులేనని ఆయన అన్నారు.
కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని తెలిపారు.

జర్నలిస్టులకు రావలసిన న్యాయమైన డిమాండ్లలో అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మరియు హెల్త్ కార్డులు కార్పొరేట్ ఆసుపత్రిలో చెల్లుబాటు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రధాన సౌకర్యాన్ని కల్పించాలని, జర్నలిస్టులపై దాడులను దానికి ప్రత్యేక రక్షణ చట్టం రూపొందించి అమలు చేయాలన్నారు. 15 సంవత్సరాల అనుభవం కలిగిన జర్నలిస్టులకు 15000 రూపాయల పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని, 10 లక్షల రూపాయలతో కూడిన ప్రమాద బీమా సౌకర్యాన్ని అందించాలని జర్నలిస్టులకు జర్నలిస్టు బందు పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేయాలని డిమాండ్ చేశారు.

దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఇస్తున్న విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు గౌరవ వేతనాన్ని 25 వేల రూపాయలు కల్పించాలని కోరారు. ఈ మహాసభలో ఆలేరు మాజీ ఎమ్మెల్యే జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ డాక్టర్ కుడుదల నగేష్, యాదగిరిగుట్ట మాజీ ఎంపీపీ, బిజెపి రాష్ట్ర నాయకులు పల్లెపాటి సత్యనారాయణ, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సూదగాని హరిశంకర్ గౌడ్,

టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి, ఐ యఫ్ డబ్ల్యూ జె వర్కింగ్ కమిటీ సభ్యులు కపిలవాయి రవీందర్, టి జే యు రాష్ట్ర కార్యదర్శి బింగి స్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి కాట్యాడ బాపురావు, రాష్ట్ర కార్యదర్శి దశరథం, రాష్ట్ర నాయకుడు సిద్దల రవి, కామారెడ్డి జిల్లా కన్వీనర్ గోపాల్,

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మహేష్ గౌడ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అశోక్, మెదక్ జిల్లా అధ్యక్షుడు రామయ్య, సిద్దిపేట్ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య, జనగామ జిల్లా అధ్యక్షుడు రమేష్,కామారెడ్డి జిల్లా నాయకులు గడీల రాజేందర్ రావు,

టీజేయు ఆలేరు మండల అధ్యక్షులు చింతకింది వెంకటేశ్వర్లు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపరాజు వెంకన్న, జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవరకొండ లావణ్య, జిల్లా కార్యదర్శి బోడ నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు శనిగరం శ్రీనివాస్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి దూడల అంబిక,

జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు కంది చంద్రకళ, గుండాల మండల అధ్యక్షులు నరేష్, ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్, సునీల్, దశరథ ,

ఆత్మకూరు మండల ప్రధాన కార్యదర్శి అజీజ్, రాజాపేట మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, నరేష్, భువనగిరి పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, ఆలేరు పట్టణ ఉపాధ్యక్షుడు ఎండి జహంగీర్,తదితరులు పాల్గొన్నారు.