Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రభుత్వ పథకాల్లో పేదోనికి మొండి చెయ్యి.. ఉన్నోనికి నిండు చెయ్యి

నిరుపేదల స్వంత ఇల్లు కల నిరాశే.
గృహ లక్ష్మీ పథకం లబ్ది దారుల ఎంపికపై సర్వత్రా విమర్శలు.

ఏటూరునాగారం సెప్టెంబర్ 29 నిజం చెపుతాం న్యూస్:

నిరుపేదల జన్మల కల స్వంతిల్లు నిర్మాణం, కానీ పెదరికమే వారికి శాపం, ఆర్థిక స్మోమత లేకపోవడమే వారికి పాపం, కోట్లాడి తెచ్చుకున్న బంగారు తెలంగాణలో ఎప్పటికయినా ప్రభుత్వం స్వంతిల్లు మంజూరు చెయ్యకపోతుందా, మా కల నిజం కాకపోతుందా అని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న నిరుపేద ప్రజల కళ్ళల్లో నిరాశే ఎదురైంది.

గత నెలలో స్వంత ఇంటి స్థలం ఉన్నవారికి మూడు విడతల వారిగా 3 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తుంది అన్న ప్రకటనతో అప్పులు చేసుకొని, పనులు మనేసుకొని మీసేవ కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల వద్ద పొద్దంత లైన్లో నిలపడి ధరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు కె సి ఆర్ ప్రభుత్వం లో పేదలకు కచ్చితంగా గృహాలు వస్తాయన్న ఆశతో ఎదురు చూసిన వారికి నిరాశే ఎదురైంది.

అయితే ఈ ప్రక్రియను జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో సంబంధిత మండల అధికారులు క్షున్నంగా సర్వే చేసి నిరుపేదలను గుర్తించి వారి నుండి సేకరించిన పూర్తి ఆధారాలను జిల్లా కలెక్టర్ కి అందించాల్సి ఉంటుంది.

అయితే కొందరు రాజకీయ నాయకులు స్వంత పార్టీ కార్యకర్తలకే మంజూరు గుర్తించారు. ఇందులో అన్ని కులాలను పరిగణలోకి తీసుకుని వారిలో వ్యవసాయ భూమి, ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలు పొందని వారు, ఇల్లు లేని వారికి మంజూరు చేయాల్సింది.

కానీ నిరుపేదలకు మంజూరు చెయ్యకుండా బి ఆర్ ఎస్ పార్టీ వాళ్లకే మంజూరు చేపించారని గ్రామాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ విషయాన్ని మండల నాయకులను, గ్రామ సర్పంచ్, ఎంపిటిసి లను అడగగా మాకు తెలియదు అని అన్నారు.
ఏటూరునాగారం మండలంలోని రామన్నగూడెం గ్రామంలో పూర్వం నుండి నిరుపేదలుగా ఉండిపోయినవారు చాలా మంది ఉన్నారు.

గ్రామంలో ఎస్సి, ఎస్టీ, బిసి, ఓసి ,మైనారిటీ కులాలవారిలో ఇప్పటికి ఇల్లు లేని వారు ఉన్నారు.మరి వీరి సంగతి ఏమిటి వారికి ఎందుకు ఇల్లు మంజూరు చెయ్యలేదు, ఇప్పుడు పెట్టిన లిస్ట్ లో ఎవరు పేద వాళ్ళు, ఎవరు ధనికులు అనేది స్పష్టంగా కనిపిస్తుంది.

*కూలి పనులకెళ్లి బ్రతుకుతున్న నాకు ఇల్లు మంజూరు చెయ్యలేదు.

తాళ్ళపెళ్లి రాజేశ్వరి ఇదే గ్రామంలో నివసిస్తూ కూలి పనులు చేసుకుంటూ బ్రతుకుతున్న ఆమెకు శిథిలాస్థలో కూలిపోయే మట్టిగొడల గుడిసె ఉంది,స్వంత ఇంటి స్థలం ఉంది తనకు ఇల్లు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకుంది కానీ అనర్హులకు ఇల్లు మంజూరు చేశారని ఓట్ల కోసం ఇంటి ముందుకు వచ్చిన వారికి గుణపాఠం చెప్తామని బాధను వెలుబుచ్చుకుంది.

నాకు స్వంత ఇంటి స్థలం ఉంది కాని ఇల్లు మంజూరు కాలేదు.

నా పేరు సుంకర శ్రీనివాస రావు పూర్వం నుండి ఇదే ఊరిలో నివస్తున్నాను.ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గృహ లక్ష్మీ పథకంలో దరఖాస్తు చేసుకున్నాను.నాకు రెండు గుంటల ఇంటి స్థలం ఉంది ఇల్లు వస్తుందని ఆశించాను.

మొన్నటివరకు ఆ నోటా ఈ నోటా నాకు ఇల్లు మంజూరు అయినది అన్న మాట సంతోషాన్ని ఇచ్చింది కానీ, నిన్న విడుదల చేసిన లిస్ట్ లో నా పేరు లేకపోవడంతో నిరాశకు గురయ్యను ,పేదరికంలో ఉండి ఇల్లు కట్టుకోలేని నాకు ఇల్లు మంజూరు చెయ్యకుండా, కొందరికి ఒకే ఇంట్లో ఇద్దరికి, ఉద్యోగం చేసే వారికి, డాబాలు ,భూములు ఉన్నవారికి ఎలా మంజూరు చేస్తారు,

దీనికి ముఖ్య కారకులు ఎవరు అని ఆవేదన వ్యక్తం చేశాడు. వచ్చేది ఎలక్షన్ సమయం ఉన్నందున ఇలాంటి మోసపూరిత పనులు చేసి నిరుపేదల ఆశను, నిప్పుల్లో వేసిన వారికి తగిన బుద్ధి చెపుతాం అని మీడియా ముందు వాపోయారు.

ఈ విషయం మీద జిల్లా కలెక్టర్ మరల వేరిఫికేషన్ చేపించి అర్హులైన పేద వారికి మాత్రమే ఈ గృహ లక్ష్మీ పథకాన్ని అందేలా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలతో పాటు నేను కోరుతున్నాను అని తన బాధను వ్యక్తం చేశాడు.