Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

రక్తం పారిచ్చిన చరిత్ర కాంగ్రెస్ అయితే, నీళ్లు పారిచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది

రక్తం పారిచ్చిన చరిత్ర కాంగ్రెస్ అయితే, నీళ్లు పారిచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది

కెసిఆర్ తలపెట్టిన కాలేశ్వరం ప్రాజెక్టుతోనే తుంగతుర్తి

ససశ్యామలం

కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రాత్రి పగలు తేడాలు లేకుండా హరీష్ రావుకు చేసిన కృషి ఫలితమే కనువిందు చేస్తున్న పచ్చని పొలాలు

60 ఏళ్లలో చేయని అభివృద్ధిని చేసిన 9 ఏళ్ల లో చేసిన ఘనత ఎమ్మెల్యే కిషోర్ ది

గాదరి కిషోర్ నాయకత్వమే తుంగతుర్తి ప్రజలకు అండ

మరోసారి ఆశీర్వదించండి..

తుంగతుర్తి అభివృద్ధిలో భాగస్వామ్యం కండి

గ్రామాల్లో ఘర్షణలు కొట్లాటలు పెట్టడమే..కాంగ్రెస్ నేతల సిద్ధాంతం

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు విద్యుత్ శాఖ మంత్రి గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి

సూర్యాపేట ప్రతినిధి సెప్టెంబర్ 28 నిజం చెపుతాం న్యూస్

తుంగతుర్తి నియోజకవర్గం లో రక్తం పారిచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ది అయితే, నీళ్లు పారిచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది , స్థానిక శాసనసభ్యులు గాదరి కిషోర్ కుమార్ ది అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి , రాష్ట్ర ఆర్థిక శాఖ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావులు అన్నారు

సహచర మంత్రి హారీష్ రావు తో కలిసి తుంగతుర్తి లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం నకు శంకుస్థాపన చేసి,, సుమారు 55 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా ఆశీర్వాద సభ లో మాట్లాడిన మంత్రి ముఖ్యమంత్రి కెసిఆర్ తలపెట్టిన కాలేశ్వరం ప్రాజెక్టుతోనే తుంగతుర్తి ససశ్యామలం అయిందన్నారు.

కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రాత్రి పగలు తేడాలు లేకుండా హరీష్ రావుకు చేసిన కృషి ఫలితమే ప్రస్తుతం కనువిందు చేస్తున్న పచ్చని పొలాలు అని అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గం లో

60 ఏళ్లలో చేయని అభివృద్ధిని 9 ఏళ్ల లో చేసిన ఘనత ఎమ్మెల్యే కిషోర్ ది అని అన్నారు.. కిషోర్ నాయకత్వం , నియోజక అభివృద్ధి కోసం నిత్యం 18 గంటల పాటు కష్టపడిన ఆయన కృషి కారణంగా తుంగతుర్తి నియోజకవర్గంలో నలవైపులా అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.

గాదరి కిషోర్ నాయకత్వమే తుంగతుర్తి ప్రజలకు అండ అన్న మంత్రి మరోసారి కిషోర్ ను ఆశీర్వదించి తుంగతుర్తి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.

2014 ముందు నియోజకవర్గం లో నిత్యం ఎక్కడో ఒక చోట రక్తం ఎరులే పారేదన్న మంత్రి ,గ్రామాల్లో ఘర్షణలు కొట్లాటలు పెట్టడమే

కాంగ్రెస్ నేతల సిద్ధాంతం అని మండిపడ్డారు. కిషోర్ నాయకత్వంలో తుంగతుర్తి నియోజకవర్గం ప్రశాంతంగా ఉందన్నారు.

ప్రతి ఒక్కరూ 2014 ముందు పరిస్థితులను ప్రస్తుతమున్న పరిస్థితులను బేరీజు వేసుకొని సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. సభలో హరీష్ రావు మాట్లాడుతుంటే యువత ప్రజలు కేరింతలు కొట్టారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ బొల్లం మల్లయ్య యాదవ్ ఆయిల్ ఫ్రెండ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గుజ్జ యుగంధర్ రావు,

కాసోజు శంకరమ్మ రైతుబంధు జిల్లా కోఆర్డినేటర్ ఎస్ఏ రజాక్ డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు తాటికొండ సీతయ్య ఎంపీపీ గుండ గాని కవితా రాములు గౌడ్ స్నేహలత ఎంపీటీసీ చెరుకు సుజనా పరమేష్ జెడ్పిటిసి దావుల వీరప్రసాద్ యాదవ్ టిఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కలెట్లపల్లి శోభన్ బాబు వైస్ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, కలెక్టర్ ఎస్ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు…