Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మారనున్న….. తుంగతుర్తి రూపురేఖలు

44 కోట్ల వ్యయంతో 100 పడకల దవాఖాన శంకుస్థాపన

4 కోట్లతో సెంటర్ లైటింగ్ నిర్మాణ పనులు,

చెరువు వద్ద 2 కోట్ల 80 లక్షలతో బ్రిడ్జి నిర్మాణం పనులు, తుంగతుర్తి నుంచి పసునూరు అలుగు వరకు 5 కోట్ల 80 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం పనులకు శంకుస్థాపన

, వెంపటి రోడ్డు నుండి రావులపల్లి వరకు నూతన బీటీ నిర్మాణ పనులు శంకుస్థాపన.

కాలేశ్వరం జలాలతో పూర్తిగా చెరువులు కుంటల జలమయంతో.. రైతుల కళ్ళలో ఆనందం

తుంగతుర్తి సెప్టెంబర్ 28 నిజం చెపుతాం న్యూస్

గడిచిన 40 సంవత్సరాల కాలంలో తుంగతుర్తి నియోజకవర్గాన్ని వివిధ పార్టీల నాయకులు పరిపాలించినప్పటికీ, అభివృద్ధి మాత్రం అంతంత మాత్రమే ఉన్నదని చెప్పవచ్చు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం గడిచిన తొమ్మిది సంవత్సరాలుగా యువనేత నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ పరిపాలనలో సుమారు 5000 ఎలా కోట్ల పైచిలుకు భయంతో అభివృద్ధి పనులు చేశారు.

తోడు ముఖ్యమంత్రి కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు ఏర్పాటు చేయడంతో, గోదావరి జలాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా, నేడు ఎస్సారెస్పీ కాలువల ద్వారా ప్రతి గ్రామంలోని కుంటలు చెరువులు పూర్తిగా జలమయం కావడంతో గతంలో బీటలు పడ్డ భూములు సైతం సస్యశ్యామల గా మారడంతో రైతుల కళ్ళలో ఆనందం చూస్తున్నారు.

రైతుల అభ్యున్నతిని గమనించి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టడంతో నేడు రైతులకు వరంగా మారింది.

ఈ సంవత్సరం రెండు దఫాలుగా రైతుకు రైతుబంధు ఇవ్వడంతో పంట పండించే స్థాయికి ఎదిగాడు.

పండించిన పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వమే నేరుగా ఐకెపి కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి, న ఎకౌంటు డబ్బులు వేస్తున్న ఘనత కెసిఆర్కే దక్కిందని చెప్పవచ్చు.

ఎమ్మెల్యే తుంగతుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల దవాఖాన మార్చుటకు ముఖ్యమంత్రి కేసీఆర్ తోఫాలు దఫాలుగా చర్చించి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుతో 44 కోట్ల నిద్రలో మంజూరు చేయించిన ఘనత మన ఎమ్మెల్యేకే దక్కింది

. కరోనా కష్ట కాన కష్టకాలము నేనున్నానంటూ ముందుకు వచ్చి ప్రతి గ్రామంలో ప్రతి వీధిలో తిరుగుతూ, ప్రజలకు ధైర్యం చెప్పారు. రావులపల్లి బ్రిడ్జి నిర్మాణం కోసం సుమారు 6 కోట్ల నిధులను శాఖ మంత్రి కేటీఆర్ తో కలిసి నిధులను మంజూరు చేయడంతో, సూర్యాపేట వరంగల్ జిల్లాలకు నేరుగా రవాణా సౌకర్యం మెరుగుపడింది.

వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి లు, ప్రజా ప్రతినిధులు, సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడుకల దావకాన కోసం 44 కోట్ల వ్యయంతో శంకుస్థాపన, 4 కోట్లతో మెయిన్ రోడ్డు పై లైటింగ్ నిర్మాణ పనులు, రెండు కోట్ల 80 లక్షల బ్రిడ్జి నిర్మాణం, తుంగతుర్తి నుండి పసునూరు అలుగు వరకు 5 కోట్ల 80 లక్షల వ్యయంతో, తుంగతుర్తి నుంచి రావులపల్లి రోడ్డు నిర్మాణ పనులకు శుక్రవారం శంకుస్థాపన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరగనున్నాయి.

ఏమైనా తుంగతుర్తి నియోజకవర్గం లో అభివృద్ధి జరిగిందంటే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,తో మన ఎమ్మెల్యేకు సత్య సంబంధాలు ఉండడంతోనే అభివృద్ధి సాధ్యమైందని చెప్పవచ్చు. రానున్న రోజుల్లో తుంగతుర్తి నియోజకవర్గం మున్సిపాలిటీ కేంద్రంగా మారానున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు…