Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జనతన సర్కారు వద్దు…తెలంగాణ సర్కారే ముద్దు

* జనతన సర్కారు వద్దు…

*తెలంగాణ సర్కారే ముద్దు అంటూ.. మారుమూల ఆదివాసీలు భారీ ర్యాలీ..

చర్ల సెప్టెంబర్ 27 ( నిజం చెపుతాం) మావోయిస్టు తీసుకు వస్తానంటున్న జనతన సర్కార్ మాకు వద్దు తెలంగాణ సర్కారే ముద్దు అంటూ మారుమూల గ్రామాల ఆదివాసీలు బుధవారం బస్టాండ్ సెంటర్ నుండి ర్యాలీగా బయలుదేరి

నక్సలిజం వద్దు అభివృద్దే ముద్దు మావోయిస్టులు తమ గ్రామాల్లోకి రావద్దు అంటూ బుల్లెట్ సంస్కృతి వీడి బ్యాలెట్ ద్వారా గ్రామాల అభివృద్ధి చేయాలంటూ నినాదాలు చేశారు

తాహసిల్దార్ రంగు రమేష్. సిఐ రాజగోపాల్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా ఆదివాసీలు మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం పొట్ట చేత పట్టుకుని సతీష్ గడ్ నుండి తెలంగాణ రాష్ట్రానికి వలస వచ్చామని అప్పటి ప్రభుత్వం మమ్ములను ఆదరించి గ్రామాలను గుర్తించి మాకు మౌలిక సదుపాయాలు కల్పించిందని అన్నారు

తాము అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల నిషేధిత సిపిఐ మావోయిస్టులు పార్టీ సభ్యులు తరచుగా మా గ్రామాలకు వచ్చి మీటింగులు ఏర్పాటు చేస్తూ మీటింగులకు బియ్యం నిత్యవసర వస్తువులను తీసుకురమ్మని బలవంతం పెడుతున్నారని దీంతో మా గ్రామాల అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మావోయిస్టులు ఇకపై గ్రామాలకు రావద్దు అంటూ అధికారులకు వినతిపత్రం ఇస్తున్నామని తెలిపారు

మావోయిస్టుల పార్టీ 19వ వార్షికోత్సవం ఈరోజుతో ముగియడం మావోయిస్టుల పార్టీకి అండగా ఉండవలసిన ఆదివాసి గ్రామాల ప్రజలు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించడం చర్చనీయాచమైంది ఈ ర్యాలీలో అటవీ గ్రామాల ఆదివాసీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు