Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

జియో ఫైబర్ సేవలు ప్రారంభం

జియో ఫైబర్ సేవలు ప్రారంభించిన జియో డిప్యూటీ మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి

– ముఖ్య అతిధులు లక్కినేని రఘు.

కల్లూరు సెప్టెంబర్ 25 (నిజం న్యూస్ )

జియో ఫైబర్ ఒక కనెక్షన్ తో అనేక రకాల ప్రయోజనాలు వినియోగించుకోవాలని డిస్టిబూటర్ నల్లపరెడ్డి శిరీష, వేణుగోపాల్ రెడ్డి ఎన్ఎస్పి మీసేవ వారి ఆధ్వర్యంలో కల్లూరు లో జియో ఫైబర్ సేవలను రైతుబంధు మండల కన్వీనర్ డాక్టర్ లక్కినేని రఘు, జియో మేనేజర్ శ్రీపతి శ్రీనివాసరావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్ నల్లపురెడ్డి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా జియో సేవలు మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరించబడుతున్నాయని దానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు.

జియో ఫైబర్ లో 650 టీవీ చానల్స్ , వాయిస్ కంట్రోల్ రిమోట్, హైస్పీడ్ ఇంటర్నెట్, ల్యాండ్ లైన్ ఫోన్ కనెక్షన్ ఉచితం, జియో ఫైబర్ ఒక కనెక్షన్ తోనే అనేక ప్రయోజనాలు ఉన్నాయని వీటన్నిటిని, కల్లూరు ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేనేజర్ శ్రీపతి శ్రీనివాసరావు, అసిస్టెంట్ మేనేజర్ హరిబాబు, మీ సేవ అధినేత వేణుగోపాల్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.