ఆసరా పెన్షన్లలో అవినీతికి పాల్పడుతున్న కేసముద్రం సబ్ పోస్ట్ మాస్టర్….?
కేసముద్రం సబ్ పోస్ట్ ఆఫీస్ కు ఆసరా పెన్షన్ల ద్వారా ప్రతినెల మండలానికి 2 కోట్ల 6o లక్షలు.
మండలంలో 20 మంది బిపిఎంలు. (బ్రాంచ్ పోస్ట్ మాస్టర్)
ఒక్కో గ్రామ పరిధిలో ఆసరా పెన్షన్లు ఇవ్వడానికి 30 లక్షల నుండి 60 లక్షలు ప్రతినెల బిపిఎంలు తీసుకువెళ్తారు.
ఇందులో రవాణాచార్జీల క్రింద ప్రభుత్వం లక్షకు, 50/_ రూపాయల చొప్పున బిపిఎంలకు ఇస్తుంది.
ఈ 50/_ రూపాయలు కూడా ఇవ్వకుండా బిపిఎంల పోట్ట కొడుతున్న సబ్ పోస్ట్ మాస్టర్.
కిందిస్థాయి ఉద్యోగులపై జులుం, ఉద్యోగాల నుండి తొలగిస్తాను అంటూ హుకుం జారీ.
మహబూబాబాద్, జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 25,( నిజం న్యూస్):
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని సబ్ పోస్ట్ మాస్టర్ వికలాంగుల వృద్ధుల ఆసరా పెన్షన్లలో అవినీతికి పాల్పడుతున్నాడు.
ఈ మండల పోస్ట్ ఆఫీస్ కు ఆసరా పెన్షన్ క్రింద ప్రతినెల 2 కోట్ల 60 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదల అవుతాయి. ఈ మండలంలో 20 మంది బిపిఎంలు ( బ్రాంచ్ పోస్ట్ మాస్టర్) ఉన్నారు. వీరు గ్రామస్థాయిలో పనిచేసే ఉద్యోగులు. ఆసరా పెన్షన్ల మంజూరి అయిన గ్రామాలకు వీరి ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి గ్రామ బిపిఎం ఆయా గ్రామాలలో ఎన్ని మంజూరి అయితే అంత డబ్బు సబ్ పోస్ట్ మాస్టర్ ద్వారా తీసుకపోతారు.
ఉదాహరణకు చిన్న గ్రామాలైతే 6 లక్షల వరకు, పెద్ద గ్రామ పంచాయితీలలో 30 లక్షల వరకు తీసుకు వెళుతుంటారు. ఈ సందర్భంగా ఒక్కో బీపీఎం కు లక్షకు 50/_ రూపాయలు ప్రభుత్వం రవాణాచార్జీల క్రింద ఇస్తుంది. రవాణా ఖర్చుల కింద బిపిఎంలకు ఇచ్చే 50/_ రూపాయలు కూడా ఇవ్వకుండా కేసముద్రం సబ్ పోస్ట్ మాస్టర్ ధ తనే కాజేస్తున్నాడు.
ఇదేమని అడిగితే నాకు ప్రస్తుతం టి ఏ, డి ఏ లు లేవు. అందుకే తీసుకుంటున్నాను. అంటూ చిరుద్యోగులు అయిన బీపీఎంలను బెదిరింపులకు గురి చేస్తూ, మిమ్ములను ఉద్యోగాల నుండి తొలగిస్తాను.
నాకు ఉన్నతాధికారులలో మంచి సంబంధాలు ఉన్నాయి. స్థానిక రాజకీయ నాయకులు అండదండలు నాకు ఉన్నాయి. అని వారిని బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నాడు. ఏ ప్రభుత్వ పని చేసిన తక్కువ డబ్బులు చెల్లించి పెద్ద మొత్తంలో బిల్లులు పెట్టి ప్రభుత్వాన్ని కూడా మోసం చేస్తున్న ఈ సబ్ పోస్ట్ మాస్టర్ పై ఉన్నతాధికారులు విచారణ జరిపితే మరెన్నో అవినీతి పనులు వెలుగులోనికి వస్తాయని అంటున్నారు.
గతంలో ఇలాంటి అవినీతి పనులు చేస్తున్నందున అధికారులు ఇతనిని బదిలీ చేయడం జరిగింది. ఉన్నతాధికారులను మేనేజ్ చేసి మళ్లీ ఇక్కడికి బదిలీ అయ్యాడు.
ఇది ఇలా ఉంటే తన సొంత తమ్ముని భార్య ను ఆర్డి ఏజెంట్ (రికరింగ్ డిపాజిట్) గా నియమించి ప్రతి నెల ఆసరా పెన్షన్లు మండల హెడ్ క్వార్టర్లలో ఇంటింటికి పంపిణీ చేస్తుంది.
ఈ క్రమంలో ప్రతి ఆసరా పెన్షన్ వ్యక్తి వద్ద పైన ఇచ్చే 16/_ రూపాయలు ఇవ్వకుండా తనే తీసుకోవడమే కాక ఇంటికి వచ్చి ఆసరా పెన్షన్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరి వద్ద నుండి బలవంతంగా 50/_ రూపాయలు వసూలు చేస్తుంది.
ఆసరా పెన్షన్లలో సైతం లంచాలు తీసుకునే ఇలాంటి లంచగొండులపై ఉన్నతాధికారులు సరియైన కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.