కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లిలో మూడు ఇళ్లల్లో చొరబడ్డ దొంగలు
నిజామాబాద్ బ్యూరో, నిజం న్యూస్ సెప్టెంబర్ 24 : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి 35వ వార్డు గాయత్రి నగర్ పోలీస్ కృష్ణాజీ రావు విధులలో 3 ఇండ్లలో చొరబడిన ఇంటికి తాళాలు,బీరువాలు పగలగొట్టి అందిన కాడికి దోచుకెళ్లిన దొంగలు.ఇంటికి తాళాలు ఉండడంతో అదే అదును చూసుకొని తలుపులు పగలగొట్టి దొరికిన కాడికి దోచుకున్నారు,
బంగారం,నగదు ఎత్తుకెళ్లారు.అయితే వివరాలు ఈ విధంగా ఉన్నాయి శనివారం రాత్రి చిట్టోజి నాగరాజు ఇంట్లో అందరూ తమ బంధువుల ఇంటికి రామాయంపేట కు వెళ్లారు,వారి ఇంట్లో నుండి 12 తులాల బంగారం,7లక్షల 50 వేల నగదు,నల్లపూస దండ,వంకుంగరం,కమ్మ బుట్టలు అపహరించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
కాగా మరో రెండు ఇండ్లలో బీరువాతాలను పగలగొట్టి డబ్బులు ఏమి దొరకకపోవడంతో దొరికిన కాడికి దోచుకొని పరారయ్యారని తెలిపారు.
కాగా ఆదివారం ఉదయం పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే క్లుజ్ టీంతో విచారణ కొనసాగిస్తున్నారు.శ్రవణ్ కుమార్ పోస్ట్ ఆఫీస్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నారు.
కాగా వారు తమ సొంతూరికి వెళ్లడంతో దొంగలు ఇంటి తాళం,బీరువా తాళం పగలగొట్టి చూడగా నగదు పోలేదని తెలిసింది.ఈమెకు దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.