RAM: విరాట్ కోహ్లీ పాత్ర చేయడానికి నేను సిద్ధం…
టాలీవుడ్ యువ నటుల్లో ఒకరైన రామ్ పోతినేని ఇస్మార్ట్ శంకర్, ది వారియర్ వంటి సినిమాలతో తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించి తనదైన స్టైల్ లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలలో ఒకరిగా నిలిచారు..
ప్రస్తుతం రామ్ పోతినేని బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన భారీ పాన్ ఇండియన్ మూవీ స్కంద. ఇది హీరో రామ్ పోతే నీ మొదటి పాన్ఇం డియా సినిమాగా అన్ని భాషలలో విడుదలై ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి..
ఇక ఒక ఇంటర్వ్యూలో భాగంగా హీరో రామ్ మాట్లాడుతూ, తనని చూసిన వారు ఎక్కువగా విరాట్ కోహ్లి పోలికలు మీలో ఉన్నాయి అని అంటుంటారని అన్నారు. అయితే తనకు కూడా విరాట్ బ్యాటింగ్ అంటే ఎంతో ఇష్టం అని, ఒకవేళ అన్ని కలిసి వచ్చి విరాట్ బయోపిక్ చేయాల్సి వస్తే ఆయన పాత్రలో నటించడానికి నేను రెడీ అని అన్నారు రామ్.
తనకు విరాట్ కోహ్లీ పాత్రన్న విరాట్ కోహ్లీ అన్న ఎంతగానో ఇష్టమని తనను చూసిన ప్రతి ఒక్కరు అలానే ఉన్నావని అనడంతో ఒకవేళ చేయాల్సి వస్తే భవిష్యత్తులో అన్ని విధాలుగా నేను సిద్ధమని ఆయన స్కంద ఇంటర్వ్యూలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలలో ఎలా సమాధానం ఇచ్చారు…