Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ల్యాండర్ అండ్ రోవర్ తిరిగి పనిచేయబోతున్నాయా ?

చంద్రయాన్-3ప్రయోగం విజయవంతం అయి భారతదేశం యొక్క పేరును చరిత్రలో నిలిచిపోయ్యేలా చేసింది. ప్రస్తుతం చంద్రయాన్-3 నిద్రస్థితిలో నుండి బయటకు వచ్చింది. సెప్టెంబర్ 20న శివశక్తి పాయింట్ మీదా సూర్యుడి వెలుగు పడింది.

చంద్రుడిగా యొక్క ధక్షిణ పై దిగి విజయవంతంగా పరిశోధన చేసి అక్కడి వాతావరణ పరిస్థితులను గురించి పూర్తిగా తెలుసుకున్నారు. అయితే చంద్రుడిగా యొక్క ఉపరితలంపై పరిశోధనలు పూర్తయిన తరువాత చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ నిద్రాణ స్థితిలోకి వెళ్లిందని అందరికి తెలిసిందే.

మళ్ళీ రోవర్ అండ్ ల్యాండర్ వాటిని తిరిగి పనిచేయించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయత్ననాలు చేేస్తున్నారు. కానీ ల్యాండర్ అండ్ రోవర్ల  నుండి ఎటువంటి సమాచారం కానీ వాటి నుండి సంకేతాలు రావడం లేదని ఇస్రో తెలిపింది.

అయితే వాటితో సంబంధాలను తిరిగి పునరుద్ధరించుకోడానికి ప్రయత్నాలు సాగుతా యని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

చంద్రయాన్ 3 ప్రయోగం లోని ల్యాండర్, రోవర్లు 14 రోజులే పనిచేసే విధంగా ముందుగా తయారు చేశారని తెలిసిందే. భూమిపై 14 రోజులంటే చంద్రుడిపై  ఒక పగలుతో సమానం. సెప్టెంబర్ 20న చంద్రుడిపై సూర్యరస్మి పండింది దానీతో ల్యాండ్ అండ్ రోవర్ తిరిగి చార్జ్ చేసుకోవడం జరుగుతుంది. చంద్రునిపై రాత్రుళ్లు ఉష్ణోగ్రతలు మైనస్ 120 నుంచి మైనస్ 200 డిగ్రీల సెల్సియస్కు పడిపోతాయి

. ఆ శీతల పరిస్థితుల్లో రోవర్, ల్యాండర్లు పనిచేసే అవకాశాలు తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. ప్రస్తుతం రోవర్, ల్యాండర్ చంద్రుని దక్షిణ ద్రువం వద్ద ఉన్నాయి.

అక్కడ ఇప్పుడు సెప్టెంబర్ 20 నుంచి తిరిగి సూర్యోదయం ప్రారంభమైంది. సెప్టెంబర్ 22 నుంచి సోలార్ ప్యానెళ్లు, ఇతర పరికరాలు పూర్తిగా చార్జి అవుతాయి కాబట్టి పనిచేస్తాయన్న ఆశ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నిలేష్ దేశాయ్ తెలిపారు.  ఈ పరిస్థితుల్లో వాటిని తిరిగి ప్రయోగాలు చేయించాలన్న ప్రయత్నంలో ఇస్రో  చాలా ఉంది.

మళ్ళీ ల్యాండర్ అండ్ రోవర్ తిరిగి పనిచేస్తే చంద్రుడి గురించి మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు..