Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ప్రైవేట్ అధ్యాపకుడి సమాజ సేవ.  ,

ములుగు జిల్లా జగ్గన్నపేట గ్రామానికి చెందిన “కురందుల రఘుపతి” తండ్రి పేరు కురందుల బాలయ్య గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ సాంఘిక సంక్షేమ బాcలికల గురుకుల కళాశాల ఏటూరునాగారం నందు కెమిస్ట్రి లెక్చరర్ గా పనిచేస్తూ 1999-2000విద్యాసంవత్సరంలో ములుగు డిగ్రికళశాలలో ఎ.బి.వి.పి ప్రెసిడెంట్ గా, 2000-2001ములుగు పట్టణ కార్యదర్శి గా,2001-2002 ములుగు జిల్లా బాగ్ ప్రముఖగా బాధ్యతలు స్వీకరించి విద్యార్ధులకు మరియు ప్రజలకు ఎదురయ్యే ప్రతి సమస్యను తన సమస్యగా భావించి సమస్యలను యూనివర్సిటిలోని వి.సిల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంకోసం అనేక ర్యాలీ లు, రాస్తారోకోలు ,ఆందోళన కార్యక్రమాలను చేస్తు,ప్రముఖపాత్ర పోషిస్తు ములుగు జిల్లా ప్రజలమన్ననలను విద్యార్థుల మన్ననలను పొందుతూ, అదే
విధంగా (సి.యస్.అయ్ఆర్. నందు 55 ర్యాంకు సాదించి) పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలోని కెమిస్ట్రీ డిపార్టుమెంటు నందు రిసర్చ్ స్కాలర్ గా కొనసాగుతు”సర్వ మానవ శ్రేయస్సు సకుల జనులరక్ష”లో బాగంగా యం.ల్. సి పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమంలో పాల్గోని ఓటు నమోదును ఆన్లైన్ ద్వారా చేసుకొని పట్టభద్రులకు ఆన్లైన్ మరియు ఆప్లైన్ ద్వారా నమోదు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించడం జరుగుతుంది,రఘుపతి గారికి ప్రజలఅండదండలు ఉంటే నవసమాజనిర్మాణం,సమసమాజనిర్మాణం,జాతిపునర్ణిర్మాణం సాధించవచ్చు అన్నారు.