Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

తుంగతుర్తిలో మంచినీటి గోస… పట్టించుకోని ప్రజాప్రతినిధులు

మంచినీళ్లు అడుగుతే ….అక్రమ అరెస్టులా

తుంగతుర్తి సెప్టెంబర్ 23 నిజం చెపుతాం న్యూస్

తుంగతుర్తి మండల కేంద్రంలో గడిచిన 40 సంవత్సరాల క్రితం.. మంచినీటి కష్టాలు ఏ విధంగా ఉన్నాయో …తిరిగి మళ్ళీ పునరావృతమయ్యాయి.

గతంలో పదుల సంఖ్యలో బోర్లకు మోటార్లు బిగించి లక్షల రూపాయల ఖర్చులతో ప్రజల ప్రయోజనాల కోసం నీటి వసతులు కల్పించేవారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం… మిషన్ భగీరథ పథకాన్ని వేల కోట్లు పెట్టి ప్రవేశపెట్టగా… గత కొంతకాలంగా నీటి పంపిణీ జరిగే క్రమంలో పైపుల రిపేరుల సమస్యలతో… మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు చందంగా నేటి సరఫరా సాగుతున్నట్లు ప్రజలు ఎద్దేవా చేస్తున్నారు.

గడచిన పది రోజులుగా మిషన్ భగీరథని నీళ్లు రాకపోవడంతో, ఇళ్లలో మహిళలు వంటలు చేసుకోవడానికి స్నానాలు చేసుకోవడానికి కూడా నీళ్లు కష్టంగా మారింది.

దీనితో ఆగ్రహానికి గురై మంచినీటి బిందెలు చేత భూమి ఏకంగా తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ తమ కష్టాలను విన్నవించుకోవడానికి ప్రయత్నించగా ,పోలీసులు తమనే అక్రమ అరెస్టులు చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఉంటే గ్రామంలో గతంలో పనిచేసిన బోర్లు నేడు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో ప్రత్యేకంగా కష్టాలు కొనితెచ్చుకున్నట్లు అయ్యాయని వాపోతున్నారు.

స్థానిక గ్రామపంచాయతీ సిబ్బంది కనీసం మంచినీటి ట్యాంకుల ద్వారా, నీళ్లు అందించడం లేదని ప్రజల గుసగుసలాడుతున్నారు. మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యంపై, తక్షణమే పూర్తిస్థాయిల విచారణ జరిపి జిల్లా కలెక్టర్ మంచినీటి సౌకర్యాలు యుద్ధ ప్రాతిపదికపై తక్షణమే మంచినీటి సరఫరా జరిపించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు….