Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

భారతదేశంలో కొండ లోపల రాజ మహాల్ ఉన్న ఏకైక నగరం ఒక్క ఉదయగిరే

ఇక్కడ. తవ్వుకున్న వారికి తవ్వుకున్నంత ప్రతిఫలం ఉంటుందంటారు. తవ్విన కొద్ది నిధులు బయట పడతాయన్న ప్రచారం ఉంది.
శిల్పాలు, స్థంభాలు నిధికి దారి చూపుతాయి. నిధిని చూపడానికి అక్కడ రహాస్య రాతలు రాసి ఉన్నాయి. కాని నిధిని దక్కించుకోవాలంటే కాపాలాగా ఉన్న
శక్తిని ప్రసన్నం చేసుకోవాల్సిందే..లేకుంటే చావు తప్పదు.

అందుకే శక్తిని ప్రసన్నం చేసుకోవడానికి నరబలులను ఇవ్వడానికి కూడా వెనుకాడడం లేదు.
అయినా అక్కడ నిధి దొరికిన వాళ్లు అకారణంగా చనిపోతున్నారని తెలుస్తోంది. ఇంతకీ ఈ దుర్గం ఎక్కడ ఉందనుకుంటున్నారా…అదే

నెల్లూరు జిల్లాలో ఉన్న ఈ ఉదయగిరి కోట. దీనికి దాదాపు వెయ్యేళ్ల చరిత్ర ఉంది.
ఉదయగిరి కోటలో వజ్రాలు, రతనాలు రాసులుగా ఉన్నాయన్న ప్రచారం ఉంది.

కొండ లోపల సొరంగాలతో కూడిన ఒక మహాల్ ఉండటం భారతదేశంలో ఇదే కావచ్చు.

చరిత్రను ఒక సారి పరిశీలిస్తే….
పల్లవులు, చోళులు, రెడ్డి రాజులు, విజయనగర రాజులు, ఢిల్లీ సుల్తానులు, చివరకు ఆంగ్లేయులు కూడా ఈ దుర్గాన్ని పాలించినట్లు చారిత్రకాధారాలున్నాయి.
చోళుల తర్వాత పల్లవ రాజులు పాలించారని జయదేవుని శాసనాన్ని బట్టి తెలుస్తున్నది.
1235వ సంవత్సరంలో ఈ ప్రాంతం కాకతీయుల వశమైంది.

సంజీవి పర్వతంగా పేరుగాంచిన ఉదయగిరి కొండపై నిర్మితమైన కోట 35 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంటుంది.
ఈ కొండపై 365 దేవాలయాలతో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది.
1471 నుండి 1488 వరకు ఈ దుర్గం విజయ నగర రాజుల ఆధీనంలో ఉండేదని చారిత్రకాధారాలను బట్టి తెలుస్తున్నది.
శ్రీకృష్ణదేవరాయలు1514వ సంవత్సరంలో జూన్ 9న ఈ దుర్గాన్ని వశపరచుకున్నాడని చారిత్రకాధారం.
1540వ సంవత్సరంలో రాయల అల్లుడు అశీయ రామరాయలు ఉదయగిరి పాలకుడయ్యాడు.

1579లో గోల్కొండ సేనాని ముల్కు ఉదయగిరిని ముట్టడించాడని తెలుస్తున్నది.
ఆ విధంగా ఉదయగిరి గోల్కొండ నవాబుల వశమైంది.
ఆ తర్వాత ఢిల్లీ చక్రవర్తుల సేనాని మీర్ జుమ్లా దీన్ని 1626లో వశపరచుకొని అక్కడ అనేక మసీదులను నిర్మించి స్థానికంగా వుండే ఒకరికి ఆదిపత్యాన్నిచ్చి ఢిల్లీ వెళ్లి పోయాడు.

ముస్లిం పాలకులలో చివరగా సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాన్ ఈ దుర్గాన్ని పాలించాడు. అతను వాడిన ఖడ్గం ఈ నాటికీ ఉదయగిరిలో ఉంది.
ఆ తర్వాత ఈ దుర్గం ఆంగ్లేయుల పరమైంది. బ్రిటీష్ పాలనలో డైకన్ దొర కలెక్టరుగా ఉన్నప్పుడు రాజమహల్ సమీ పంలో అద్దాల మేడను ఇంకా అనేక భవనాలను నిర్మించాడు.

ఉదయగిరి దుర్గంలో ఆయా రాజుల కాలంలో నిర్మించిన అనేక కట్టడాలు…ఆలయాలు, మసీదులు ఇప్పుడు శిథిలావస్థలో ఉన్నాయి.
ఇంతటి చరిత్ర కలిగిన ఈ ఉదయగిరి దుర్గం నెల్లూరుకు సుమారు వంద మైళ్ల దూరంలో ఉంది.
సముద్ర మట్టానికి 3097 మీటర్ల ఎత్తులో ఈ దుర్గం ఉంటుంది.

నిధులను ఎక్కడ దాచారు…?
ఇంతకీ ఈ దుర్గంలో నిధులు ఎక్కడ ఉన్నాయి. దానికి దారి ఎలా తెలుస్తుంది.
స్తానికులు తెలుపుతున్న సమాచారం ప్రకారం రాణి మహాల్ దగ్గర ఉన్న గుహాలో 6 మెట్లు క్రిందకు దిగితే ఒక తలుపు ఉంటుంది. ఆ తలుపుకు ఒక చక్రం ఉంటుంది.
ఆ చక్రాన్ని3 సార్లు తిప్పితే ఆ తలుపు తెరుచుకుంటుంది. ఆ తర్వాత పెద్ద సొరంగం ఉంటుంది.

దానిలోకి వెళితే నిధి రహాస్యం తెలుస్తోందంటున్నారు.
చనిపోయిన రాజకుటుంబీకులను కోట పై భాగంలో వారు వేసుకున్న బంగారంతో అలాగే పూడ్చి పెట్టేవారని తెలుస్తోంది.
దీంతో గుప్త నిధి వేటగాళ్లు సమాధులను కూడా తవ్వి చూస్తున్నారు.

 

నిధిని దక్కించుకోవడం కోసం అక్కడ ప్రతీచోట తవ్వకాలు జరిగిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
ఉదయగిరి కొటలోని దేవాలయాల లోపల ఉన్న చిహ్నలు అనంతపద్మనాభస్వామి దేవాలయంలో ఉన్నట్టే ఉన్నాయంటున్నారు.
అంటే ఇక్కడ కూడా ఖచ్చితంగా అనంత పద్మనాభస్వామి దేవాలయానికి మించిన నేల మాలిగలు ఉండే అవకాశం ఉందనే ప్రచారం ఉంది.
అవి రాజ మహాల్ లో ఉన్నాయా, రాణి మహాల్ లో ఉన్నాయా ..? లేక నిధుల కోసం ప్రత్యేక గదులున్నాయా..అన్నది అంతుతేలని మిస్టరీగా ఉంది.

 

ఉదయగిరిలో దుర్గం నుండి ఆలయం వరకు నిధులున్నాయని ప్రచారం ఉండటంతో నిధుల తవ్వకాల వల్ల 365 దేవాలయాల్లో 3 మాత్రమే మిగిలాయి.

మిగిలినవి తవ్వకాల వల్ల కనుమరుగై పోయాయి.
రాయల వారి సతీమణి తిరుమలాదేవి పూజించిన ల దేవి గుడిలో ఉన్న గుర్తులు నిధులు ఉన్న సంకేతాలను చూపెడుతున్నాయని నమ్ముతున్నారు.
గుప్త నిధి తవ్వకాలను జరిపే వాళ్లు ఇక్కడ చిన్న పిల్లాడిని నరబలి కూడా ఇచ్చిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.