Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

సిహెచ్ సి మంజూరు పై హర్షం..

– శంకుస్థాపన చేయాలని మంత్రికి వినతి
చర్ల సెప్టెంబర్22 ( నిజం చెపుతాం) ఏజెన్సీ చర్ల మండల కేంద్రంలో సిహెచ్ సి మంజూరు చేయడం పై టిఆర్ఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు

ఈ సందర్భంగా ఖమ్మం ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు చర్ల బిఆర్ఎస్ నాయకులుకృతజ్ఞతలు తెలిపారు. మండల పర్యటనలో భాగంగా శంకుస్థాపన చేయాలని మంత్రి అజయ్ కుమారును కోరారు

సందర్భంగా మండలంలోపార్టీ పరిస్థితిపై ఆయన అడిగి తెలుసుకున్నారు

వివిధ రకాల సంక్షేమ పథకాలు దళిత బంధు బీసీ బందు గృహలక్ష్మి పథకాల అమలుపై మంత్రి తగు సూచనలు చేశారు

మంత్రిని కలిసిన వారిలో డి పి ఎం ఎస్ డైరెక్టర్ పరచూరిరవికుమార్ రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ కొసరాజు కుమార్ రాజా

చర్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు మండల మాజీ ప్రధాన కార్యదర్శి బండి వేణు ఎస్సీ సెల్ అధ్యక్షులు తోటమల్ల వరప్రసాద్ సొసైటీ డైరెక్టర్ పందెలపల్లి రాధాకృష్ణ తడికల రమేష్ తదితరులు ఉన్నారు